Tuesday, September 25
Log In

TEST: 270- CURRENT AFFAIRS 27SEPT

రాష్ట్రీయం
1) పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏ డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ జాతీయ అవార్డు ఇచ్చింది ?
జ: ముల్కనూర్ డెయిరీ

జాతీయం
2) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటన కోసం ఏ దేశం వెళ్లనున్నారు ?
జ: ఆఫ్రియా ఖండం ( ఇథియోపియా, జిబూతీ)
3) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన - సౌభాగ్య కింద అందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఎంత బడ్జెట్ కేటాయించారు ?
జ: రూ.16,320 కోట్లు
4) దివ్యాంగులకు సహాయకారిగా ఉండేందుకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ప్రారంభించిన కొత్త యాప్ ఏది ?
జ: దివ్యాంగ్ సారథి
5) కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తో న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపిన అమెరికా రక్షణ మంత్రి ఎవరు ?
జ: జేమ్స్ మాటిస్
6) 2017-18 నాటికి భారత్ వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుతం ఎంతశాతం ?
జ: 7శాతం (గతంలో 7.4శాతంగా ప్రకటించింది )
7) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ (ONGC) కొత్త ఛైర్మన్, ఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: శశి శంకర్


8) మొదటి ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2017 ఎక్కడ జరుగుతోంది ?
జ: న్యూఢిల్లీ
9) 2017ను ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
10) విజన్ 2025 ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: కర్నాటక
11) గుజరాత్ లోని కాండ్లా పోర్టు పేరును ఏ విధంగా మారుస్తున్నారు ?
జ: దీన్ దయాళ్ పోర్ట్
12) ది షేర్షా ఆఫ్ కార్గిల్ : కెప్టెన్ విక్రమ్ భత్రా - పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: దీపక్ సురానా
13) గజ్నేర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ:  రాజస్థాన్
14) మేరీకోమ్ జీవిత కథను వెండితెరకు ఎక్కించిన వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఇప్పుడు మరో ప్లేయర్ జీవితంపై సినిమా తీయనుంది. ఆమె ఎవరు ?
జ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్
15) ఏ అథ్లెట్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్  మ్యూజియంలో ప్రతిష్టించనున్నారు ?
జ: అథ్లెట్ మిల్కా సింగ్

అంతర్జాతీయం
16) ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికాలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో రెండో స్థానంలో నిలిచిన భారతీయ మహిళ ఎవరు ?
జ: పెప్సికో ఛైర్మన్, సీఈఓ ఇంద్రా నూయి
17) ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికా వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఐదో ర్యాంకు ఎవరికి దక్కింది ?
జ: ICICI బ్యాంక్ ఎండీ, CE చందా కొచ్చర్
18) మైక్రో సాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ తన జీవిత పాఠాలను పుస్తకంలో ఉంచారు. దాని పేరేంటి ?
జ: హిట్ రిఫ్రెష్
19) 7వ ASEM ఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరుగుతోంది ?
జ: దక్షిణ కొరియా (సియోల్ లో )
20) న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 72వ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించారు ?
జ: మిరోస్లావ్ లాజ్ కాక్
21) 2017 సెప్టెంబర్ 20న అణ్వస్త్రాలను నిషేధించాలన్న ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకం చేశాయి ?
జ: 50 దేశాలు ( మొదటి సంతకం బ్రెజిల్ ది  )
22) ఈజిప్ట్ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం ఇన్ క్రెడిబుల్ ఇండియా పేరుతో ఎక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ?
జ: కైరో
23) ప్రాథమిక హక్కుల పరిరక్షణలో కృషి చేసినందుకు గాను ప్రతిష్టాత్మక స్వీడిష్ అవార్డుకు ఎంపికైన సీనియర్ న్యాయవాది ఎవరు ?
జ: కొలిన్ గొన్సాల్వ్స్
24) ఆకాశం, నీటిలో సంచరించే ఉభయచర డ్రోన్ ను ఏ దేశం తయారు చేసింది ?
జ: చైనా