Tuesday, September 25
Log In

TEST: 269- CURRENT AFFAIRS 26 SEPT

రాష్ట్రీయం
1) 30 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ వేడుకలను ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: ఎల్బీ స్టేడియం ( హైదరాబాద్ )
2) ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు కేంద్రం నియమించిన కమిటీ ఏది ?
జ: షీలా భిడే కమిటీ
(నోట్: ఇంకా 20 సంస్థల విభజన పెండింగ్ లో ఉంది )
3) రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆన్ లైన్ లోనే సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం ఎన్ని పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి ?
జ: 72
4) దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ్ దర్పణ్ లో మొదటిర్యాంకు సాధించిన జిల్లా ఏది ?
జ: జగిత్యాల
(నోట్: 90 రోజుల్లో 60 వేల మరుగుదొడ్లు నిర్మించారు )
5) బ్రిటన్ కు చెందిన ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం సంస్థ ఇచ్చే ఎక్స్ లెన్స్ అవార్డును అందుకోబోతున్న నటుడు, రాజకీయ పార్టీ అధినేత ఎవరు ?
జ: పవన్ కల్యాణ్
6) దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎవరి పేరు కేంద్ర క్రీడా శాఖ ప్రతిపాదించింది ?
జ: పి.వి. సింధు

జాతీయం
7) పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించే ఏ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీలో ప్రారంభించారు ?
జ: సౌభాగ్య  (ప్రధానమంత్రి సహజ్ బిజలీ హర్ ఘర్ యోజన )
(నోట్: 15 నెలల్లో నాలుగు కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం )
8) ప్రధాని నరేంద్రమోడీ ఐదుగురు సభ్యులతో ఆర్థిక సలహా మండలిని నియమించారు. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారు ?
జ: బిబేక్ దేబరాయ్ (నీతి ఆయోగ్ సభ్యులు)
9) గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలపై చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రారంభించనున్న కార్యక్రమం ఏది ?
జ: గ్రామ్ సమ్రుద్ధి ఏవమ్ స్వచ్ఛత (Gram Samridhi Evam Swachhta)
10) తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ?
జ: హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆరుముఖ స్వామి
11) కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) రాజీవ్ మెహ్ రిషి ఎప్పటిదాకా ఈ పదవిలో కొనసాగుతారు ?
జ: 2020 ఆగస్టు 7 ( మూడేళ్ళ పాటు )
12) అంగారకుడి పరిశోధనల కోసం వెళ్ళిన మంగళయాన్ మూడేళ్ళు పూర్తి చేసుకుంది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు ?
జ: 2013 నవంబర్ 5న
(నోట్: 2014 సెప్టెంబర్ 24న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు )
13) భారత సైనికదళానికి మధ్యశ్రేణి ఉపరితల వాయు క్షిపణులు ( MRSAM) సరఫరా చేసేందుకు ఇమరాత్ పరిశోధన కేంద్రం తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది ?
జ: BDL (భారత్ డైనమిక్స్ లిమిటెడ్ )
14) ONGC (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్) కి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: శశి శంకర్
15) హ్యూరన్ సంస్థ రూపొందించిన కుబేరుల జాబితాలో భారత్ లో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు ?
జ: ముకేశ్ అంబానీ
16) ప్రపంచంలోనే 250 అతిపెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానం దక్కించుకున్న భారతీయ కంపెనీ ఏది ?
జ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
(నోట్: S & P గ్లోబల్ ప్లాట్స్ సంస్థ ఈ గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాని తయారు చేసింది )
17) సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 వేల నుంచి ఎంతకు తగ్గించింది ?
జ: రూ.3 వేలు
18) జాతీయ బాల కార్మిక నిర్మూల వ్యవస్థ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం ప్రారంభించనున్న వెబ్ పోర్టల్ ఏది ?
జ: పెన్సిల్ ( Platform for Effective Enforcement for No Child labour )
19) అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రపంచంలోనే భారత్ ఎన్నో స్థానంలో నిలిచినట్టు వాల్డ్ న్యూక్లియర్ ఇండస్ట్రీ స్టేటస్ రిపోర్ట్ - 2017 ప్రకటించింది ?
జ: మూడో స్థానం
20) 1983 వరల్డ్ కప్ భారత్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత నేపథ్యంతో వస్తున్న బాలీవుడ్ మూవీలో ఎవరు కపిల్ పాత్రను పోషిస్తున్నారు ?
జ: రణ్ వీర్ సింగ్ (దర్శకత్వం: కబీర్ ఖాన్ )
21) ఆసియా ఇండోర్ క్రీడల్లో బిలియర్డ్స్ లో భారత్ కు బంగారు పతకం అందించిన ప్లేయర్ ఎవరు ?
జ: సౌరవ్ కొఠారి
22) 57వ నేషనల్ ఓపెన్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ 2017 పోటీలకు ఆతిథ్యమిస్తున్న రాష్ట్రం ఏది ?
జ: తమిళనాడు
23) ఆసియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న బజ్ రంగ్ ... ఏ క్రీడాకారుడు ?
జ: రెజ్లింగ్

అంతర్జాతీయం
24) అమెరికా కొత్తగా ట్రావెల్ బ్యాన్ విధించిన మరో 3 దేశాలు ఏవి ?
జ: ఉత్తరకొరియా, చాద్, వెనెజులా
(గతంలో ఉన్న సూడాన్ పై నిషేధాన్ని తొలగించారు )
25) ఇండోనేషియాలో కౌటా పర్యాటక ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఏ అగ్నిపర్వతం రగులుతోంది ?
జ: మౌంట్ ఏజుంగ్
26) జర్మన్ ఛాన్స్ లర్ గా నాలుగోసారి ఏంజిలా మెర్కెల్ పదవిని చేపట్టబోతున్నారు.  ఆమె పార్టీ పేరేంటి ?
జ: క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ ( CDU)
27) జర్మనీ దిగువ సభను ఏమంటారు ?
జ: బుందే స్టాగ్ (ఈసారి సభ్యుల సంఖ్య 709 మంది )
28) ముస్లిం మహిళలను ఆటలను చూసేందుకు మొదటిసారిగా స్టేడియంలోకి అనుమతించిన దేశం ఏది ?
జ: సౌదీ అరేబియా (రియాద్ స్పోర్ట్స్ స్టేడియంలోకి అనుమతించారు )
29) ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలిగా పేరున్న ఈజిప్ట్ మహిళ ఎమన్ అహ్మద్ UAEలోని బుర్జీల్ ఆస్పత్రిలో చనిపోయింది. ఆమె గతంలో భారత్ లో ఏ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంది ?
జ: ముంబైలోని సైఫీ హాస్పిటల్
30) పాకిస్తాన్ రష్యా కలసి నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటి ?
జ: ద్రుజ్బా  2017 ( DRUZBA)