Tuesday, September 25
Log In

TEST: 266-CURRENT AFFAIRS-23 SEPT

రాష్ట్రీయం
1) భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కాగానే మే 15 లోగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని  రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో ఎకరానికి ఎంత మొత్తం ఇవ్వనున్నారు ?
జ: రూ.4వేలు
2) అతిపెద్దదైన మేడారం జాతర ఎప్పటి నుంచి జరగనుంది ?
జ: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ (2018)

జాతీయం
3) వారణాసిలో రూ.300కోట్లతో నిర్మించిన దీన్ దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
4) ప్రధాని ప్రారంభించిన జల్ అంబులెన్స్ దేనికి సంబంధించింది ?
జ: గంగానదిపై అంబులెన్స్ సేవలు
5) జల్ శవ్ వాహన్ - అనే సేవలు దేనికి సంబంధించినవి ?
జ: గంగానదిపై మృతదేహాల్ని తీసుకెళ్ళే బోట్
6) దక్షిణాదిలో పేరున్న విజయా బ్యాంకు ఉత్తరాదికి చెందిన ఏ బ్యాంకు విలీనం కావాలని నిర్ణయించాయి ?
జ: దేనా బ్యాంక్
7) ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి మద్దతు తెలిపిన దక్షిణాది సూపర్ స్టార్ ఎవరు ?
జ: రజనీ కాంత్
8) అత్యాచార బాధితులను ఆదుకోడానికి నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఎంత మొత్తం నిధులు ఇస్తోంది ?
జ: రూ.200 కోట్లు
9) వస్త్ర-2017 పేరుతో ఇంటర్నేషనల్ టెక్స్ టైల్ అండ్ అపెరల్ ఫెయిర్ ఏ నగరంలో జరుగుతోంది ?
జ: జైపూర్
10) భారత్ లో మొదటి ఎలక్ట్రిక్ బస్ సర్వీసును (13వేల అడుగుల ఎత్తులో) ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
జ: హిమాచల్ ప్రదేశ్
11) కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కి CMD గా ఎవరు నియమితులయ్యారు ?
జ: పి.అల్లీరాణి
12) ఏ నదిపై పరిశోధనలు జరపడానికి బోట్ ల్యాబ్ ను బయోటెక్నాలజీ శాఖ ఏర్పాటు చేసింది ?
జ: బ్రహ్మపుత్ర
13) మజ్ గాన్ డాక్ లిమిటెడ్ తయారు చేసిన ఏ స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ ను ఇండియన్ నేవీకి అప్పగించారు ?
జ: INS కల్వరి
14) జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో మొదటి కాగితరహిత ఈ-కోర్టును ఎక్కడ ప్రారంభించారు ?
జ: శ్రీనగర్
15) ట్రాన్స్ జెండర్స్ (లింగమార్పిడి) కూడా ప్రభుత్వ పథకాలకు అర్హులను చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఆంధ్రప్రదేశ్
16) ఉత్తర విదేశీ భాషా చిత్రాల కేటగిరీలో భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీకి వెళ్ళిన బాలీవుడ్ మూవీ ఏది ?
జ: న్యూటన్
(డైరక్టర్: అమిత్ మసూర్కర్)

అంతర్జాతీయం
17) అమెరికాకి చెందిన EB-5 వీసాలు కావాలంటే ఆ దేశంలో ఎంత పెట్టుబడులు పెట్టాలి ?
జ: మిలియన్ డాలర్లు ( రూ.6.5 కోట్లు)
18) బంగ్లాదేశ్ లో రూపుర్ పవర్ ప్లాంట్ ను ఏ రెండు దేశాలు కలసి నిర్మిస్తున్నాయి ?
జ: భారత్ , రష్యా
19) 2017 సంవత్సరానికి ప్రపంచ వాణిజ్యం ఎంత శాతం పెరుగుతుందని WTO అంచనా వేసింది ?
జ: 3.6శాతం
20) చైనాలో జరుగుతున్న పాండా కాంగారూ 2017 సంయుక్త సైనిక విన్యాసాల్లో చైనాతో పాటు ఏ దేశం పాల్గొంటోంది ?
జ: ఆస్ట్రేలియా
21) దేశంలో పెరిగిపోతున్న అవివాహితులకు పెళ్ళిళ్ళు చేసేందుకు ఏ దేశం ఏర్పాట్లు చేసింది ?
జ: చైనా
22) విమానాల్లోని బిజినెస్ క్లాస్ లో డబుల్ బెడ్స్ సౌకర్యాన్ని కల్పించిన ప్రపంచంలోనే మొదటి విమాన యాన సంస్థ ఏది ?
జ: ఖతార్ ఎయిర్ వేస్
23) ఫ్రాన్స్ లో జరిగే FIFA ఉమెన్స్ వరల్డ్ కప్ - 2019 స్లోగన్ ఏంటి ?
జ: Dare to Shine

NOTE: CURRENT AFFAIRS  ఆదివారం ఇవ్వడం లేదు. మళ్ళీ సోమవారం మాత్రమే