Tuesday, September 25
Log In

TEST: 267 & 268- CURRENT AFFAIRS-24,25SEPT

రాష్ట్రీయం
1) దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం వీల్ చైర్ లిఫ్ట్ సేవలను ఏ విమానశ్రయంలో ప్రారంభించారు ?
జ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో
(నోట్: సుగమ్య భారత్ అభియాన్ ఆధ్వర్యంలో  రిమోట్ సాయంతో నడిచే ఈ లిఫ్ట్ ను ప్రారంభించారు )
2) వరదల సమయంలో బాధితులను రక్షించేందుకు ఏ పేరుతో సైనికులు, NDRF (జాతీయ విపత్తు నిర్వహణ బృందం) హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు ?
జ: ప్రళయ సహాయ్ - 2017
3) ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు లాంటి మైనార్టీల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం ఏది ?
జ: టీ - ప్రైమ్ ( Telangana State program for rapid incubation of minorities entrepreneurs (T-PRIME)
4) దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్ 2న ప్రారంభించిన పథకం పేరేంటి ?
జ: టీ ప్రైడ్ Telangana State Program For Rapid Incubation of Dalith entrepreneurs )
5) సివిల్స్ సాధించాలనే గిరిజన యువతకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభిచనున్న ఐఏఎస్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: రాజేంద్రనగర్ మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో
6) అక్కినేని నాగేశ్వరరావు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును ఎవరికి బహుకరంచారు ?
జ: నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు

జాతీయం
7) అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత కుటుంబాలకు చిట్టచివరి వరకూ విద్యుచ్ఛక్తి అందించే పథకాన్ని పీఎం నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దాని పేరేంటి ?
జ: ప్రధానమంత్రి సహజ బిజ్లీ హర్ ఘర్ యోజన
8) ప్రధాని నరేంద్రమోడీ రేడియో ప్రసంతం మన్ కీ బాత్ కు మూడేళ్ళు పూర్తయ్యాయి.  ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ?
జ: 2014 అక్టోబర్ 2న
(ఇటీవలే 36 వ ప్రసంగాన్ని ప్రధాని పూర్తి చేశారు )
9) కొత్త కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ?
జ: రాజీవ్ మెహ్ రిషి (3యేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు )
10) దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ప్రధానమంత్రి LPG పంచాయత్ ను ఆవిష్కరించిన కేంద్రమంత్రి ఎవరు ?
జ: ధర్మేంద్ర ప్రధాన్
11) హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగే 5 రోజుల మల్టీ మీడియా ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. దాని పేరేంటి ?
జ: Naya Bharat-Hum Karke Rahenge
12) భారత్ కు యుద్ధ విమానాలు, డ్రోన్ల అమ్మకానికి సంబంధించి చర్చలు జరిపేందుకు ఢిల్లీకి రానున్న అమెరికా రక్షణ మంత్రి ఎవరు ?
జ: జేమ్స్ మాటిస్
13) అమెరికా మన దేశానికి ఏ డ్రోన్లను అమ్మాలని నిర్ణయించింది ?
జ: సీ గార్డియన్ ( 22)
14) ఢిల్లీలో హత్యకు గురైన కేజే సింగ్ ఏ రంగానికి చెందినవారు ?
జ: జర్నలిజం
15) భారత్ కు చెందిన ఏ మహిళా శాస్త్రవేత్త వందో జన్మదినం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ ప్రదర్శించింది ?
జ: అసిమా ఛటర్జీ
( నోట్: కలకత్తా వర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు పొందిన తొలి మహిళ)
16) సామాన్యులకు తక్కువ రేటుకే ఆహారాన్ని అందించేందుకు రైల్వే శాఖ స్టేషన్లలో నిర్వహిస్తున్న క్యాంటిన్ పేర్లేంటి ?
జ: జనఆహార్
17) అమెరికాలోని మెటిరీయల్ రీసెర్చ్ సొసైటీ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం వోన్ హిప్పెల్ కు ఎంపికైన భారతీయ శాస్త్రవేత్త ఎవరు ?
జ: ప్రొ. CSR రావు
18) ఇటీవల వినిపిస్తున్న కోల్డ్ స్టార్ట్ అనే పదానికి అర్థం ఏంటి ?
జ: పరిమిత యుద్ధ వ్యూహం
19) బ్రహ్మగిరి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: కర్ణాటక
20) ఆయుర్వేద ఔషధాలను విక్రయించేందుకు డాబర్ ఇండియా ఏ ఈకామర్స్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: అమెజాన్
21) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అథ్లెట్స్ ఫోరమ్ లో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం తరపున ప్రతినిధిగా పాల్గొన్న ఇండియన్ బాక్సర్ ఎవరు ?
జ: మేరీ కోమ్

అంతర్జాతీయం
22) భారత్ కాకుండా ఏ దేశంలో రామాయణం స్మారక స్టాంపులను రిలీజ్ చేశారు ?
జ: జపాన్ లో
(నోట్: నమస్తే ఇండియా 2017వేడుకల్లో భాగంగా యొయొగి ఉద్యానవనంలో వీటిని ఆవిష్కరించారు )
23) ఇరాన్ ప్రయోగించిన అధునాతన మధ్యస్థ శ్రేణి క్షిపణి పేరేంటి ? (2వేల కిమీల లక్ష్యాన్ని ఛేదిస్తుంది)
జ: ఖుర్రామ్ సహర్
24) ఇటీవల కాలంలో తరుచూ భూకంపాలు, ప్రకంపనాలతో వణికిపోతున్న దేశం ఏది ?
జ: మెక్సికో
25) భూ గురుత్వాకర్షణ శక్తి సాయంతో దిశను మార్చుకున్న నాసాకి చెందిన వ్యోమ నౌక పేరేంటి ?
జ: ఆసిరిస్ -రెక్స్
26) ప్రపంచమంతటా ఆరోగ్యం, విద్య అభిృద్ధి కోసం రూ.77వేల కోట్లకు పైగా మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు ఎవరు ?
జ: మార్క్ జుకెన్ బర్క్
27) ఏ దేశ క్రికెట్ లో అవినీతిపై ఐసీసీ విచారణ చేస్తోంది ?
జ: శ్రీలంక క్రికెట్ (SLC)