Tuesday, September 25
Log In

TEST: 264: CURRENT AFFAIRS -21SEPT

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో అత్యంత వేగంగా పనిచేసే 1000 టెరా ఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్లను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: ఐఐటీ, హైదరాబాద్
2) ఈనెల 27న న్యూఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ పాల్గొంటున్న రాష్ట్ర మంత్రి ఎవరు ?
జ: ఐటీ మంత్రి కేటీఆర్
3) 32వ అంతర్జాతీయ విత్త ధృవీకరణ సంఘం (ఇష్టా) కాంగ్రెస్ 2019 సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: హైదరాబాద్ లో

జాతీయం
4) పెన్షన్ అదాలత్ ను ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
5) దేశంలోనే మూడో అత్యున్నత పౌర అవార్డు పద్మభూషణ్ కి ఎంపికైన క్రికెటర్ ఎవరు ?
జ: ఎం.ఎస్ ధోని
6) మొదటి బిమ్ స్టెక్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్సర్ సైజెస్ - 2017 ను ఎవరు నిర్వహిస్తున్నారు ?
జ: NDRF (National Disaster Response Froce)
7) న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (NBA) కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: రజత్ శర్మ ( ఇండియా టీవీ ఛైర్మన్ & ఎడిటర్ ఇన్ చీఫ్ )
8) ఇండియా టీవీలో రజత్ శర్మ నిర్వహిస్తున్న ఏ కార్యక్రమం పాపులర్ అయింది ?
జ: ఆప్ కీ అదాలత్
9) దేశంలోనే మొదటిసారిగా జిల్లా స్థాయిలో కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?
జ: త్రిపుర
10) దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ?
జ: కుముదిలో తమిళనాడు ( 648 మెగావాట్స్ )
11) శశస్త్ర సీమా బల్ (SSB) కి కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: రజనీ కాంత్ మిశ్రా
12) స్వాతంత్ర్య సమరయోధులకు ఉచితంగా ఇళ్ళను ఇచ్చే కార్యక్రమం షహీద్ గ్రామ్ వికాస్ యోజన ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: జార్ఖండ్
13) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( NIA) కి కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: వై.సి. మోడీ
14) ఫోర్బ్స్ శత వసంతాల జాబితాలో (జీవించి ఉన్న 100 మంది గొప్ప వ్యాపారవేత్తల్లో) చోటు దక్కించుకున్న భారతీయ వ్యాపార దిగ్గజాలు ఎవరు ?
జ: లక్ష్మీ మిట్టల్, రతన్ టాటా, వినోద్ ఖస్లా
15) ఎగుమతులపై GST ని నిర్దారించేందుకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
జ: హస్ముఖ్ అధియా కమిటీ
16) దేశంలో విత్తన ధృవీకరణ కోసం ఏర్పాటైన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (OECD) టాస్క్ ఫోర్స్ వైస్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు. ?
జ: రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి  సి.పార్థసారధి

అంతర్జాతీయం
17) ఐరన్ యూనియన్ 5 పేరుతో అమెరికా ఏ దేశంతో కలసి సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తోంది ?
జ: UAE
18) పోర్చుగల్ లోని పోర్టిమోలో జరిగిన మోటార్ సైకిల్ రేస్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మొదటి మహిళ ఎవరు ?
జ: అనా కరాస్కో (Ana Carrasco)
2019 లో జరిగే ICC ప్రపంచ క్రికెట్ కప్ కు నేరుగా అర్హత పొందని క్రికెట్ జట్టు ఏది ?
జ: వెస్టిండీస్