Tuesday, September 25
Log In

TEST: 242 -CURRENT AFFAIRS -30 AUG

English Current affairs కోసం కింద చూడండి.

రాష్ట్రీయం
1) తెలంగాణ నీటి అవసరాలను తీర్చడానికి ఏ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ?
జ: తెలంగాణ తాగునీటి మండలి
2) సీతారామ ప్రాజెక్టు పనులు ఏ జిల్లాలో కొనసాగుతున్నాయి ?
జ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
3) రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎవరు ?
జ: శేరి సుభాష్ రెడ్డి
4) మిషన్ భగీరథకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతించింది. మొత్తం ఎన్ని ఎకరాల అటవీ భూముల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి ?
జ: 1,187 ఎకరాలు
5) రాష్ట్రంలోని 90 లక్షలమంది చిన్నారులకు MR టీకాలను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. MR టీకాలు ఏయే వ్యాధులకు ఇస్తారు ?
జ: మీజిల్స్, రుబెల్లా
6) హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ 24,675 ఎకరాల భూమి లీజును సర్కార్ రద్దు చేసింది. ఈభూమిని 1946లో ఎవరు ఎగ్జిబిషన్ సొసైటీకి కేటాయించారు ?
జ: అప్పటి హైదరాబాద్ ప్రధాని మీర్జా ఇస్మాయిల్
7) 1938 అక్టోబర్ లో ప్రస్తుత పబ్లిక్ గార్డెన్స్ లో ఎవరి ఆధ్వర్యంలో మొదటి పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్ ) ప్రారంభమైంది ?
జ: ఉస్మానియా గ్రాడ్యుయేట్ల సంఘం
8) 1938లో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సొసైటీకి మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జ: అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ నవాబ్ మెహదీనవాజ్ జంగ్ బహదూర్
9) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నుంచి ధ్యాన్‌చంద్‌ అవార్డు అందుకున్న ఒలింపియన్ సయ్యద్ షాహిద్ హకీమ్ ఏ క్రీడ అభివృద్ధికి కృషి చేశాడు ?
జ: ఫుట్‌బాల్

జాతీయం
10) ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 3 నుంచి 5 వరకూ చైనాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏ సమావేశాల్లో పాల్గొంటారు ?
జ: బ్రిక్స్ 9వ శిఖరాగ్ర సమావేశాలు
11) సుప్రీంకోర్టులో మొత్తం 31 మందికి న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ?
జ: 25 మంది
12) ప్రధాని నరేంద్రమోడీ రికార్డు స్థాయిలో రాజస్థాన్ లో 873 కిలోమీటర్ల పొడవైన ఎన్ని జాతీయ హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు ?
జ: 11 ప్రాజెక్టులు
13) ప్రస్తుత కేంద్ర సామాజిక న్యాయసాధికారతశాఖ మంత్రి ఎవరు ?
జ: తావ‌ర్‌చంద్‌ గెహ్లాట్
14) ప్రస్తుత భారత నౌకాదళ అధిపతి ఎవరు ?
జ: అడ్మిరల్ సునీల్ లాంబా
15) సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణం కోసం చైనా బలగాలు ఎప్పుడు డోక్లామ్ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి ?
జ: జూన్ 16, 2017
16) PSLV-C39 వాహకనౌక భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ ) నుంచి నింగిలోకి వెళ్ళనుంది. ఈ రాకెట్ ఏ ఉపగ్రహాన్ని మోసుకెళుతోంది ?
జ: IRNSS-1 H ( నావిగేషన్ వ్యవస్థ )
17) బాలల హక్కుల రక్షణ, అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి భారత్ యాత్ర పేరుతో ఏ ఉద్యమాన్ని మొదలుపెడుతున్నారు ?
జ: సురక్షిత్ బ‌చ్‌ప‌న్‌, సురక్షిత్ భారత్
18) GST విధానం అమల్లోకి వచ్చిన నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఎంత పన్ను వసూలైంది ?
జ: రూ.92,983 కోట్లు
19) హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి దక్కింది ?
జ: పారా ఒలింపియన్ దేవంద్ర జజరియా, హాకీ సీనియర్ ప్లేయర్ సర్దార్ సింగ్
20) 2004 ఏథెన్స్, 2016 రియో పారా ఒలింపిక్స్ లో జజరియా స్వర్ణాలు సాధించాడు. ఆయన ఏ ఆటకు చెందిన క్రీడాకారుడు ?
జ: జావెలిన్ త్రో
21) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నుంచి ఎంతమంది ఆటగాళ్ళు అర్జున అవార్డులు అందుకున్నారు ?
జ: 17మంది
22) రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డును ఎవరు అందుకున్నారు ?
జ: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఛైర్మన్ నీతా అంబానీ
23) ద్రోణాచార్య (Life Time Achievement) అవార్డును అందుకున్నది ఎవరు ?
జ: GSSV ప్రసాద్

అంతర్జాతీయం
24) ఉత్తరకొరియా మరో ఖండాంతర క్షిపణిని ఏ దేశం మీదుగా ప్రయోగించింది ?
జ: జపాన్
25) బ్రిక్స్ 9 వ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ:  Xiamen (పుజియన్ ప్రావిన్స్ చైనా)

=========================================================

CURRENT AFFAIRS ENGLISH TODAY - 30AUG

STATE

1)  CM KCR has decided to establish which organization for Drinking water purpose ?

Ans: Drinking water front of Telangana

2) Where the Seetharama project works going on?

Ans: Bhadradri Kothagudem District

3) Who is the Chairman of State Mineral development Corporation ?

Ans: Seri Subhash reddy

4) Central Wildlife conservation Board allowed constructing Mission Bhagiratha project works through forest land.  How many Acres of Forest will be used ?

Ans: 1187 Acres

5) State Government aims to provide MR vaccines to 90 Lakh Children.  For which purpose ?

Ans: Measles, Rubella eradication

6) State Govt. canceled 24,675 Acres of Hyderabad Exhibition Society land. In 1946 who allotted these lands to Exhibition Society?

Ans: The then Hyderabad Prime Minister Meerja Ismail

7) In October, 1938, who started the First Industrial Exhibition at Public Gardens ?

Ans:  Osmania Graduates Association

8) Who is the President of first Exhibition Society in 1938?

Ans: The then Hyderabad Municipal Commissioner Nawab Mehadeenawaj Jung Bahadur

9) Olympian Syed Shahid Hakim, who received the Dhyanchand Award from President Rama Nath Kovind for which sport?

Ans: Football

 

NATIONAL

10) Prime Minister Narendra Modi will visit China from next month 3rd to 5th.  He will be attending for which convention?

Ans: BRICS 9th annual convention

11) Actually 31 Judges should be in the Supreme court.  Present how many Judges are there?

Ans: 25 Judges

12) PM Narendra Modi inaugurated 873km National highway projects in Rajasthan. How many project will starts ?

Ans: 11 Projects

13) Who is the Union Minister of Social Justice and Empowerment?

Ans: Shri Thaawarchand Gehlot

14) Who is the Chief of Naval Staff ?

Ans: Admiral Sunil Lamba

15) When did Chinese army enter in to the Docklam areas for road construction in the borders?

Ans: June 16, 2017

16) PSLV-C39 carrier is headed by SHAR. Which satellite carries this Rocket ?

Ans: IRNSS-1 H ( Navigation system)

17) Noble peace prize winner Kailash Satyarthi can start which movement for child rights protection, illegal trafficking and sexual abuse ?

Ans: Surakshith Bachpan, Surakshith Bharath

18) How much tax has been collected across the country within one month that the GST system came into effect?

Ans: Rs.92,983 Crores

19) Who conferred to Rajivgandhi Khel Ratna award ?

Ans: Para Olympian Devendra Jajharia, Hocky Senior Player Sardar Singh

20) Devendra won the Gold medals in 2004 Athens & 2016 Rio Olympics.  He belongs to which sport ?

Ans: Javelin throw

21) How many players seelected for Arjun Awards ?

Ans: 17 players

22) Who selected for  Rashtriya Khel Protsahan award ?

Ans: Nitha Ambani ( Reliance Foundation Youth sports)

23) Who won the Dronacharya (Life Time achievement) Award ?

Ans: GSSV Prasad

 

INTERNATIONAL

24) North Korea has launched another continental missile through which country?

Ans: Japan

25) BRICS 9th annual conference to be held in which City ?

Ans: Xiamen (China)