Tuesday, September 25
Log In

TEST: 240-CURRENT AFFAIRS-28 AUG

ఇంగ్లీష్ కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి.

రాష్ట్రీయం

1) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యాన మహోత్సవం-2017ను ఎవరు ప్రారంభించారు ?
జ: వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
2) రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కోసం కేంద్రం నియమించిన కమిటీ తన ప్రక్రియను పూర్తి చేసింది. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు ?
జ: కమల్ నాథన్
3) సెప్టెంబర్ లో ఏర్పాటు చేయబోయే రైతు సమన్వయ సమితులకు జిల్లా స్థాయిలో ఎవరు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు ?
జ: జిల్లా కలెక్టర్లు
4) రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే రైతు సమితుల్లో గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంతమంది సభ్యులు ఉంటారు ?
జ: గ్రామ - 15 మంది, జిల్లా - 24 మంది, రాష్ట్ర స్థాయిలో - 42 మంది
5) ప్రతి సమితిలోనూ మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు ?
జ: మూడో వంతు
6) వచ్చే ఏడాదిలో ఏ సీజన్ లో రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఖరీఫ్ సీజన్
7) సైబర్ నేరాలపై జనానికి అవగాహన కల్పించేందుకు పోలీసులు తయారు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కి ఏ సినీ ప్రముఖులు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు ?
జ: రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్


జాతీయం

8) స్వచ్ఛ్ భారత్ లో భాగంగా స్వచ్ఛత సేవను ఎప్పటి నుంచి ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు ?
జ: సెప్టెంబర్ 15 నుంచి
9) 2024నుంచి లోక్ సభతో దేశంలోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసిన సంస్థ ఏది ?
జ: నీతి ఆయోగ్
10) తెలంగాణలోని ఎద్దు మైలారం ఆయుధాల ఫ్యాక్టరీలో బార్ కోడ్ తో రూపొందించిన అత్యాధునిక BMP-2 వాహనాలను ఎవరు ప్రారంభించారు ?
జ: ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ
11) శత్రువుల యుద్ధవిమానాలు, క్షిపణలను కూల్చేసే సామర్థ్యం ఉన్న అధునాతన క్షిపణి MRSAM ను 2020 నాటికల్లా సైన్యానకి చేరనుంది. ఇది ఎన్ని కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదు ?
జ: 70 కి.మీ.
(నోట్: ఇజ్రాయెల్ కు చెందిన ఏరేస్పేస్ ఇండస్ట్రీస్, DRDA కలసి వీటిని రూపొందిస్తున్నాయి )
12) జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం 34 ఎకరాల్లో ఎకో పార్క్ ను ఎక్కడ నిర్మించాలని భావిస్తోంది ?
జ: రాజౌరీ జిల్లాలో
13) ఏ వన్యమృగ సంరక్షణా కేంద్రంలో ఆక్రమణలను తొలగించేందుకు అసోం ప్రభుత్వం 10 వేల మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది ?
జ: అమ్‌చాంగ్‌
14) అత్యాధునిక వసతులతో  స్పోర్ట్స్ విలేజ్ ను దేశంలో ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: గ్రేటర్ నోయిడా
15) భారత్ -శ్రీలంక వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ లో అజహర్ (9378) రికార్డును ధోనీ అధిగమించాడు. ఆయన చేసిన పరుగులు ఎన్ని ?
జ: 9434

అంతర్జాతీయం

16) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పీవీ సింధుకి ఏ పతకం దక్కింది ?
జ: రజతం
17) ప్రొ బాక్సింగ్ లో విజేతగా నిలిచి రూ.1500 కోట్ల ప్రైజ్ మనీ సంపాదించిన బాక్సర్ ఎవరు ?
జ: ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా)
18) ఫ్లాయిడ్ మేవెదర్ తో తలపడి ఓడిపోయిన బాక్సర్ ఎవరు ?
జ: మెక్ గ్రెగర్
19) ఫార్ములా వన్ సీజన్ లో బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ ను ఎవరు సొంతం చేసుకున్నారు ?
జ:: హామిల్టన్
20) అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో బీభత్సం స్రుష్టిస్తున్న హరికేన్ (తుఫాన్) ఏది ?
జ: హార్వే

============================================================

CURRENT AFFAIRS ENGLISH TODAY-28AUG

STATE

1) Who inaugurated Telangana Horticulture Show-2017 at Hyderabad Neckles Road ?

Ans:  State Agriculture Minister Pocharam Srinivas Reddy

2) The committee appointed by the Central Government for the division of employees between the two States has completed its process. Who headed these Committee ?

Ans: Kamal Nathan

3) State Government will starts Farmer’s Associations Coordination Committees (FACC) from September.  Who acting as nodal officer at District Level ?

Ans: District Collectors

4) How many members in FACC’s at Village, District, State Levels ?

Ans: Village – 15 members, District – 24 Members, State level – 42 Members

5) Reservation to women in these FACC s?

Ans: 1/3rd

6) State Government decided to help Rs.4,000 to poor farmers for purchasing of Seeds & Fertilizers.  When will start this program?

Ans: from next Kharif season

7) Which film personalities will voice over short films made by police to make people aware of cyber crimes?

Ans: Raja mouli, Jr.NTR

 

NATIONAL

8) Prime Minister Narendra Modi has called on Mani ki Bhat to start Purity Service as part of Swachh Bharat.  When will starts this service ?

Ans:  September 15

9) Which organizations recommended the elections to be held simultaneously with Lok Sabha & assemblies since 2024?

Ans: NITI Ayog

10) Who inaugurated the most advanced BMP-2 vehicles made with bar code in the Yeddula Mailaram weapons factory in Telangana?

Ans: Central Finance & Defense Minister Arun Jaitley

11) The advanced missile MRSAM, capable of shattering enemy fighters and missiles, drones will be launched by 2020. How many kilometers can it eliminate targets?

Ans:  70 Kms

(Note: Aerospace industries (Israel) & DRDA )

12) Jammu& Kashmir Government to set up Eco-park in 34 acres by which District ?

Ans: Rajouri Dist

13) Assam Government to deploys 10,000 Security persons to evict illegal encroachers from which Wildlife Sanctuary ?

Ans: Amchang Wildlife Sanctuary

14) Proposed residential project Sports village will be constructed at which City ?

Ans: Greator Noida

15) Dhoni surpasses Azahar’s (9378) highest run-score record in India-Srilanka ODI Series.  How many runs did he make ?

Ans: 9434

 

INTERNATIONAL

16) Which medal did PV Sindhu won the World Badminton Championship?

Ans:  Silver

17) Who wins the Pro Boxing Championship and got Rs.1500 Crores prize money ?

Ans: Floyd Mayweather (America)

18) Who won the Belgian Grand Prix title in Formula One season?

Ans: Hamilton

19) What is the hurricane effected in the Texas State of USA ?

Ans: Harvey

20) US has imposed strong financial sanctions on which country ?

Ans: Venezuela