Wednesday, October 17
Log In

CURRENT AFFAIRS – JAN3

రాష్ట్రీయం
1) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్ గా ఎవరిని నియమించింది ?
జ: ఎర్రోళ్ళ శ్రీనివాస్
(సభ్యులుగా ఐదుగురికి అవకాశం ఇచ్చారు )
2) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 కింద తెలంగాణ హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి ?
జ: జూన్ 2, 2018
3) రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పరీక్షకు ఎన్ని పట్టణాలు సిద్దం అయ్యాయి ?
జ: 41
4) అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం ను ఎవరికి ప్రదానం చేశారు ?
జ: ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న
5) తొడసం వంశస్తుల ఆరాధ్య దైవమైన ఖాందేవుడి జాతర రాష్ట్రంలో ఏ జిల్లాలో జరుగుతుంది ?
జ: ఆదిలాబాద్ జిల్లా ( నార్నూర్ లో )

జాతీయం
6) రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల కోసం ఎలక్టోరల్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇవి ఏయే బ్యాంకు శాఖల్లో అమ్ముతారు ?
జ: స్టేట్ బ్యాంక్
7) రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరం మొత్తంలో ఎన్ని రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: గరిష్టంగా 4 రోజులు
8) పార్లమెంటు స్థాయి సంఘానికి పంపిన బిల్లు ఏది ?
జ: జాతీయ వైద్య కమిషన్ బిల్లు
9) ఈనెల 6 నుంచి 8 వరకూ ఆలిండియా డీజీపీల కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది.  ప్రధాని నరేంద్ర మోడీ దీనికి హాజరవుతారు
జ: మధ్యప్రదేశ్ లోని టెకన్ పూర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో
10) డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: రాజిందర్ ఖన్నా ( రా మాజీ చీఫ్ )
11) మహిళల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ద్వారా అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని ఈనెల 26 నుంచి ఏ రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఉత్తరప్రదేశ్ లో
12) బోగీల సంఖ్యలో ఏకరూపత తీసుకురావడానికి ఏ రైలుకైనా ఎన్ని బోగీలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: 22 బోగీలు
13) ప్రపంచంలోనే అతిపెద్ద క్రాకర్ ప్లాంట్ ను (ఇథలీన్ తయారీకి) జామ్ నగర్ (గుజరాత్) లో ఏర్పాటు చేసిన సంస్థ ఏది ?
జ: రిలయన్స్ ఇండస్ట్రీస్
14) దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరక్టర్, CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సలీల్ ఫరేఖ్
15) మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన నారి ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: మేనకా గాంధీ
16) 21వ ఆరాధని మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది ?
జ: తమిళనాడు
17) ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో హైయ్యస్ట్ ర్యాంక్ లో నిలిచిన భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: జి. సాథియన్
18) రజినీష్ గుర్బానీ ఏ ఆటకు చెందినవారు ?
జ: క్రికెట్
19) ఆర్యభట్ట రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: ఉత్తరాఖండ్

అంతర్జాతీయం
20) పాకిస్తాన్ కు అమెరికా ఎంత మొత్తం సాయాన్ని నిలిపివేసింది ?
జ: రూ.1700 కోట్లు
21) 2011 లో ప్రయోగించిన చైనాకి చెందిన తొలి అంతరిక్ష ప్రయోగ శాల కొద్ది నెలల్లో కూలబోతోంది. దీని పేరేంటి ?
జ: తియాంగాంగ్ -1
22) భారత్ లక్ష్యంగా చైనా తయారు చేసిన కొత్త క్షిపణిని డిసెంబర్ 2017 లో పరీక్షించింది.  దాని పేరేంటి ?
జ: హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికిల్ ( DF-17)

================================

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 50 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు
https://tsexams.com/trt-50days/