Monday, March 30

మార్చి 31 దాకా తెలంగాణ లాక్ డౌన్

ఈనెలాఖరు దాకా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎవ్వరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దు. నిత్యావసరాలు తెచ్చుకోడానికి ఇంటికి ఒక్కరికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. అలాగే కూలీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. బియ్యంతో పాటు ఇతర సరుకులు కొనుక్కోడానికి ఒక్కో రేషన్ కార్డుదారుడికి రూ.1500లను కూడా చెల్లిస్తామన్నారు. 1857 అత్యవసర సర్వీసుల చట్టం కింద ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్వాడీ సెంటర్లు కూడా మూసేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పేపర్స్ వ్యాల్యూయేషన్ కూడా బంద్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా 20శాతం రొటేషన్ లో ఆఫీసులకు రావాలని కోరారు. అత్యవసర సర్వీసులు మాత్రం యధావిధిగా నడుస్తాయని చెప్పారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పిరీయడ్ లో ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు తప్పనిసరిగా జీతం చెల్లించాలని ఆదేశించారు.

ఆర్టీసీలు, ట్రాన్స్ పోర్ట్ బంద్

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులను ఈనెల 31 దాకా నిలిపేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఆటోలు కూడా బయట తిరగడానికి వీల్లేదని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే అంతర్ రాష్ట్రాల సరిహద్దులను బంద్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అత్యవసర సర్వీసులకు ఉపయోగించే వెహకిల్స్ మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రైవేటు బస్సులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను కూడా రాష్ట్రంలోని అనుమతించబోమని చెప్పారు. ఎక్కువ మంది గుమి కూడవద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు సీఎం చెప్పారు.

రాష్ట్రంలో మరో ఐదుగురికి పాజిటివ్

అలాగే రాష్ట్రంలో ఇవాళ మరో ఐదుగురుకి పాజిటివ్ తేలింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం 26 మందికి కరోనా పాజిటివ్ తేలింది.