తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు 67,820

తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు 67,820

రాష్ట్రంలో మొత్తం 67 వేల 820 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ లెక్కలు తీసింది. ఏయే శాఖలో ఏవి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదికను సిద్ధం చేశారు ఆర్థిక శాఖ అధికారులు. మొత్తం 52 వేల ఖాళీలు ఉన్నట్టు జులైలో జరిగిన మంత్రి మండలి సమావేశానికి రిపోర్ట్ సమర్పించారు. ఆ లిస్ట్ సక్రమంగా లేదనీ... మరో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దాంతో అన్ని ప్రభుత్వ శాఖలు కసరత్తు చేసి చివరకు 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. PRC రిపోర్టు రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో నిర్ధారించింది. ఈ 67 వేల పోస్టులకు వచ్చే మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశముంది. ఆ తర్వాత పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రావొచ్చని చెబుతున్నారు.

టీచర్ పోస్టుల భర్తీ లేనట్టేనా ?

తెలంగాణలో ఇకపై టీచర్ పోస్టులు భర్తీ కష్టమేనని తెలుస్తోంది. 12 వేల టీచర్ పోస్టులపై గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్స్ తక్కువగా ఉన్నచోట వాటిని మూసేస్తున్నారు. టీచర్ల రేషనలైజేషన్ పై గొడవ జరుగుతోంది. అందువల్ల ఆర్థికశాఖ సమర్పించే తుది జాబితాలో టీచర్ పోస్టులను చేర్చే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అందాయని చెబుతున్నారు. దీంతో ఖాళీల సంఖ్యలో మరో 12వేల పోస్టులు తగ్గే ఛాన్సుంది.

అసలు ఖాళీలు 80వేలకు పైగానే

ఈ 67 వేల పోస్టుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారి సంఖ్యను చూపలేదు. వాటిని మినహాయించి చూపించారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 44 వేల మంది పనిచేస్తున్నారు. వీటిని కలపకుండానే డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో దాదాపు 80వేల కొలువులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true