Wednesday, November 25

తెలంగాణలో 17 వేలు ? ఆంధ్రలో 6500 పోలీస్ ఉద్యోగాలు !

రెండు రాష్ట్రాల్లో పోలీస్ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.  త్వరలో పోలీస్ కానిస్టేబుల్స్, SI రిక్రూట్ మెంట్ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో 6500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో ప్రక్రియ ప్రారంభించి జనవరి 2021 కల్లా పూర్తి చేయాలని సీఎం జగన్ ఇటీవలే పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారు.  పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ఈ విషయం ప్రకటించారు.  దాంతో వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ లో కొత్తగా 6500 పోలీస్ ఉద్యోగాల కోసం ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణలో 17 వేల పోలీస్ ఉద్యోగాలు ?

ఇటు తెలంగాణలోనూ 17 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే గత నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన పోలీస్ కానిస్టేబుల్స్, SI అభ్యర్థులకు శిక్షణ పూర్తయింది. పాసింగ్ అవుట్ పేరేడ్ కూడా పూర్తి చేసుకున్న వీళ్ళు... డ్యూటీల్లో జాయిన్ అవుతున్నారు.  ఇక TSSP కి ఎంపికైన వారికి కూడా శిక్షణ మొదలవుతోంది.  దాంతో కొత్తగా పోలీసుల భర్తీకి ప్రక్రియ మొదలుపెట్టే ఆలోచనలో తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానిస్టేబుల్ శిక్షణ

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచితంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పై శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.  రాష్ట్రంలో మొత్తం 420 జూనియర్ కాలేజీలు ఉండగా... ముందుగా 20 కాలేజీల్లో కానిస్టేబుల్ పరీక్షల రాత పరీక్షలకు ట్రైనింగ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.  ఒక్కో కాలేజీలో 100మందికి చొప్పున మొత్తం 2 వేల మందికి ఈ ఏడాది శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు.  ప్రస్తుతం రాత పరీక్షలకు ఆన్ లైన్ లో శిక్షణ మొదలు పెట్టి... ఆ తర్వాత కాలేజీలు తెరిస్తే ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం అవసరమైతే పోలీస్ శాఖ సాయం తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్లాన్ చేస్తోంది.

20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : హోంమంత్రి మహమూద్ అలీ

ఈ ఆర్టికల్ ప్రింట్ చేసిన కొన్ని గంటల్లోనే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు.  తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన  SI ల పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఈ విషయం ప్రకటించారు.  ఇప్పటికే 18 వేలకి పైగా పోలీసు పోస్టులను భర్తీ చేశామనీ... రాబోయే రోజుల్లో మరో 20 వేల పోలీస్ కొలువులను భర్తీ చేస్తామని చెప్పారు. 

ఈసారి పోలీస్ కొలువు మిస్ చేసుకోవద్దు !

ఫ్రెండ్స్

మనం గతంలో జరిగిన రెండు రాష్ట్రాల పోలీస్ రిక్రూట్ మెంట్ లో కానిస్టేబుల్, SI ఉద్యోగార్థులకు స్పెషల్ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించాం.  మా టెస్టులు రాసిన చాలామంది ఉద్యోగాలకు ఎంపికై ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.  ఈసారి కోవిడ్ కారణంగా ఎవరూ కోచింగ్ సెంటర్లకి వచ్చి శిక్షణ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే ఈసారి మన www.telanganaexams.com &www.andhraexams.com నుంచి కొత్తగా

1) మాక్ టెస్టులు (ప్రతి లెసన్ నుంచి )

2) గ్రాండ్ టెస్టులు

3) ఆన్ లైన్ మెటీరియల్ (pdf)

4) అన్ని సబ్జెక్ట్ లపై facultiesతో వీడియో క్లాసులు

5) 6 నెలల కరెంట్ ఎఫైర్స్ వీడియో క్లాసులు

6) ప్రీవియస్ పేపర్స్ విశ్లేషణ ( వీడియోలు)

7) రోజువారీ అసైన్ మెంట్స్

8) డైలీ ప్లానింగ్ ఛార్ట్

లాంటివి ఇవ్వబోతున్నాం.  దాంతో మీరు కోచింగ్ సెంటర్ లో ఉండి చదివే ఫీలింగ్ కలుగుతుంది.  మీరు పోలీస్ ఉద్యోగం కొట్టాలి అని బలంగా నిర్ణయించుకుంటే... మేము చెప్పిన రోజువారీ planning, assignments తప్పకుండా ఫాలో అవ్వాలి.

వ్యక్తిగతంగా మీ development ను పరిశీలించేందుకు ఇటీవల మేము తీసుకొచ్చిన Telangana Exams Plus యాప్ బాగా పనికొస్తుంది.  ఇందులో మీరు ఏ ఒక్క టెస్టు రాసినా ...

  • మీరు ఏ స్థానంలో ఉన్నారు ?
  • టెస్టులు రాసిన వాళ్ళల్లో మీ ఓవరాల్ ర్యాంక్ ఎంత ?
  • మీ performance ఏంటి ?
  • ఎందులో strength ?
  • ఎందులో weak ?
  • ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దానిపై మేం వీక్లీ లేదా 15రోజులకి ఒకసారి మీతో ఛాట్ ద్వారా చర్చిస్తాం.

గుర్తుంచుకోండి... మీరు ప్రిపేర్ అవ్వడానికి మా దగ్గర 25 వేలకి పైగా ఇంపార్టెంట్ ప్రశ్నలు రెడీగా ఉన్నాయి

పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల కోసం మేం AP, TELANGANA కి విడి విడిగా FREE BATCHES  ఓపెన్ చేస్తున్నాం. అందులో జాయిన్ అవ్వగలరు.  PAID MOCK/GRAND TESTS, PAID VIDEO CLASSES  షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాం..  ముందుగా మీరు ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకొని..... BATCHES లోకి వెళ్ళి అక్కడ Right side లో Plus దగ్గర ఈ కింద సూచించిన కోడ్స్ టైప్ చేస్తే... నాకు రిక్వెస్ట్ వస్తుంది.  వాళ్ళని ఆయా Free Batches లో యాడ్ చేస్తాను.

TS POLICE FREE BATCH - ఇందులో చేరాలంటే టైప్ చేయాల్సిన కోడ్  -  tspolicefree

AP POLICE FREE BATCH - ఇందులో చేరాలంటే టైప్ చేయాల్సిన కోడ్ - appolicefree

 

All the best….

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

 

మిమ్మల్ని మేం అంచనా వేయడానికి ఈ సర్వే పూర్తి చేసి మాకు పంపండి

KNOW YOURSELF

(ఈ ఫామ్ ను పూర్తి చేసిన తర్వాత Telangana Exams plus యాప్ లోని Chat లో attachment ద్వారా పంపండి. యాప్ లో Attachment కి ఇబ్బందిగా ఉంటే 703 6813 703 కి  word fileని వాట్సాప్ చేయండి )