Saturday, August 15

50,000 మందికి తెలంగాణలో ఉచిత శిక్షణ, 3800 కోర్సులు నేర్చుకునే అవకాశం !

మీకు గతంలో నేను చెప్పాను.  మీ కెరీర్ ను కొత్త పంథాలోకి తీసుకెళ్ళండి... స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్చుకోమని సలహా ఇచ్చాను.  అందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చింది.  సాధారణ డిగ్రీ లేదా బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే... ఈ 50 వేల మందికి టాస్క్ ఇస్తున్న ఉచిత కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.  తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్...  టాస్క్ .... ప్రముఖ ఆన్ లైన్ సంస్థ కొర్సెరాతో ఒప్పందం చేసుకుంది... ఈ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 3,800 కోర్సులను తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులు నేర్చుకునేందుకు అవకాశ కలుగుతోంది.  రాష్ట్రంలో 50 వేల మందికి ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఏర్పడింది.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.task.telangana.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి... మీ వివరాలు రిజిష్టర్ చేస్తే... 3 రోజుల్లో మీకు టాస్క్ నుంచి రిప్లయ్ వస్తుంది.

కొర్సెరా సంస్థ అందిస్తున్న కోర్సుల్లో చాలా ముఖ్యమైనవి... ఎంతో పాపులర్ అయిన 10 కోర్సులు ఏంటో ఒక్కసారి చూద్దాం.

  • మెషిన్ లెర్నింగ్
  • ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీ వన్ -2
  • వాట్ ఈజ్ డేటా సైన్స్
  • ప్రోగ్రామింగ్ ఫర్ ఎవ్రీబడీ (పైథాన్)
  • ఆల్గారిథమ్స్
  • ద సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్
  • ఇంగ్లీష్ కెరీర్ డెవలప్ మెంట్
  • లెర్నింగ్ హౌటు లెర్న్
  • న్యూరల్ నెట్ వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్

మొత్తం ఈ పది కోర్సులకీ ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.  వీటిల్లో కొన్ని కోర్సుల గురించి నేను రాబోయే రోజుల్లో క్లాసుల ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తాను.

డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి కోర్సులకు హైస్కిల్ డిమాండ్ ఉంటోంది.  ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న ఈ కోర్సులకు మరి కొన్నేళ్ళ దాకా ఇదే డిమాండ్ కొనసాగుతుంది.

అలాగే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, పర్సనల్ డెవలప్ మెంట్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, హెల్త్ , లాంగ్వేజ్ లెర్నింగ్ లాంటి అనేక కోర్సులు ఉన్నాయి.

మీరు తప్పనిసరిగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి... డిగ్రీ చదివే వారికి ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత లేదు.

ప్రస్తుతం ఫైనల్ ఇయర్ డిగ్రీ  లేదా బీటెక్ లో ఉన్న వాళ్ళు... ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి... రాశాక... సెప్టెంబర్ 30 లోపు రిజల్ట్స్ వచ్చి... మార్కుల మెమో రిలీజ్ అయితే మీరు కూడా అప్పుడు అప్లయ్ చేసుకోవచ్చు.

TASK websiteలో రిజిస్టర్ అవడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://docs.google.com/forms/d/e/1FAIpQLSd6S5fW1KD3VU0bx93eQAWP4H0x-uVWxhF0SsYj9Y1JMZ0jxA/viewform

TELANGANA EXAMSYOUTUBE ఛానెల్ ని SUBSCRIBE చేసుకోండి. ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?view_as=subscriber

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి) https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ