విపత్తుల నివారణ చర్యలు
1) విపత్తులపై ప్రపంచదేశాలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ?
జ: 1990-2000 దశాబ్దాన్ని
2) 1994లో ఎక్కడ నిర్వహించిన UNO సదస్సులో విపత్తులపై ఓ కార్యచరణ ప్రకటించారు ?
జం జపాన్ లోని యొకహోవాలో
3) అంతర్జాతీయ జల చైతన్య దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించారు ?
జ: 2005-2015
4) జాతీయ విపత్తుల నిర్వహణ దినోత్సవం ఏది ?
జ: అక్టోబర్ 29
5) అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు ?
జ: అక్టోబర్ 13
6) మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులకు లోనవుతున్నవి ?
జ: 26 ప్రాంతాలు ( తెలంగాణతో కలిపి)
7) మన దేశంలో మొత్తం తీర రేఖ పొడవు (7516 కిమీ) విపత్తులకు లోనవుతున్న ప్రాంతం ఎంత?
జం 5,700 కిమీ
8) విపత్తుల నిర్వహణ కోసం దేశంలో పనిచేస్తున్న అత్యున్నత అథారిటీ ఏది ?
జ: నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్...