Sunday, January 17
Shadow

Tag: telangana online classes

ఆన్ లైన్ క్లాసులు పెడితే యాక్షన్ !

ఆన్ లైన్ క్లాసులు పెడితే యాక్షన్ !

Latest News, Latest Updates
హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ క్లాసులు నడుపుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. జీవో నెంబర్. 46ను ఉల్లంఘించిన దాదాపు 15 స్కూళ్ళకి విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ నోటీసులకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూళ్ళు స్పందించాయి. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నరసమ్మ ఆదేశాలతో రికార్డులను సమర్పించాయి ఈ రెండు స్కూల్స్ యాజమాన్యాలు. రికార్డులు పరిశీలించిన తరువాత స్కూళ్ళపై యాక్షన్ తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం హైదరాబాద్ లో మరికొన్ని స్కూళ్ళల్లోనూ తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసులతో పాటు... ఇష్టమొచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న తల్లిదండ్రుల ఫిర్యాదులపైనా అధికారులు స్పందించారు.  ఇప్పటికే మేడ్చల్, కొండాపూర్, బాలాపూర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, అల్వాల్, మేడిపల్లి, చి...