
50,000 మందికి తెలంగాణలో ఉచిత శిక్షణ, 3800 కోర్సులు నేర్చుకునే అవకాశం !
https://youtu.be/kgMLQbSS1FY
మీకు గతంలో నేను చెప్పాను. మీ కెరీర్ ను కొత్త పంథాలోకి తీసుకెళ్ళండి... స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్చుకోమని సలహా ఇచ్చాను. అందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చింది. సాధారణ డిగ్రీ లేదా బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే... ఈ 50 వేల మందికి టాస్క్ ఇస్తున్న ఉచిత కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్... టాస్క్ .... ప్రముఖ ఆన్ లైన్ సంస్థ కొర్సెరాతో ఒప్పందం చేసుకుంది... ఈ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 3,800 కోర్సులను తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులు నేర్చుకునేందుకు అవకాశ కలుగుతోంది. రాష్ట్రంలో 50 వేల మందికి ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఏర్పడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.task.telangana.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి... మీ వివరాలు రిజిష్టర్ చేస్తే... 3 రోజుల్లో మీకు టాస్క్ నుంచి రిప్లయ్ వస్తుంది.
...