ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో LDC, JSA ( Junior Secretariat Asst), DEO(Data Entry Operator) లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తారు.
ఎన్ని పోస్టులు ?
ఈ ఏడాది పోస్టుల సంఖ్య ప్రకటించలేదు. అయితే గత ఏడాది 4,893 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి... ఈసారి కూడా 4 వేల నుంచి 5 వేల పోస్టుల దాకా ఖాళీలు ఉండే అవకాశముంది.
అర్హతలు:
LDC/JSA/PA/SA/DEO పోస్టులకు ఏదైనా గ్రూప్ తో ఇంటర్ /తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు
: 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి
(02.01.1994 లోపు పుట్టి ఉండరాదు 01.01...