ఈ ఏడాది 4.75 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
రాబోయే రోజుల్లో 4 లక్షల 75 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. 2019-20 సంవత్సరానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్ బోర్డులు 1,34,785 పోస్టుల భర్తీకి సిఫార్సు చేసినట్టు చెప్పారు. వీటితో పాటు SSC, RRBs, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, రక్షణ శాఖకు సంబంధించి అదనంగా 3,41,907 పోస్టులకు ప్రాసెస్ నడుస్తుందన్నారు. రాజ్యసభ సబ్యుడు కిరోడి లాల్ మీనా అడిగిన ప్రశ్నకు జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఖాళీగా ఉన్న కొలువులను నిర్ణీత వ్యవధిలోగా భర్తీ చేసేందుకు గత జనవరిలో అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలిచ్చినట్టు మంత్రి చెప్పారు. గత ఏడాదిలో UPSC ద్వారా 4,399 పోస్టులు, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 1,16,391 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహ...