1919 భారత ప్రభుత్వ చట్టం, సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ మీట్స్
01) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు ?
జ: మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం
(నోట్: భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ ఛేమ్స్ ఫర్డ్ ఈ చట్టాన్నిరూపొందించారు )
02) ఎవరి సిఫార్సులతో భారత్ లోని కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి అప్పగించారు ?
జ: మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలతో
03) ద్విసభ విధానం, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ (3యేళ్ళ పదవీ కాలం-143 మంది)కి ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి ?
జ: 1919 భారత ప్రభుత్వ చట్టం
04) 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పాటు చేశారు. దీని పదవీ కాలం ఎంత ?
జ: 5 యేళ్ళ పదవీ కాలం (60మంది).
05) ఏ చట్టం ప్రకారం ఓ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఓ ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు ?
జ: 1919 భారత ప్రభుత్వ చట్టం
06) లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితుల...