తెలంగాణలో 17 వేలు ? ఆంధ్రలో 6500 పోలీస్ ఉద్యోగాలు !
రెండు రాష్ట్రాల్లో పోలీస్ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో పోలీస్ కానిస్టేబుల్స్, SI రిక్రూట్ మెంట్ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 6500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో ప్రక్రియ ప్రారంభించి జనవరి 2021 కల్లా పూర్తి చేయాలని సీఎం జగన్ ఇటీవలే పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ఈ విషయం ప్రకటించారు. దాంతో వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ లో కొత్తగా 6500 పోలీస్ ఉద్యోగాల కోసం ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో 17 వేల పోలీస్ ఉద్యోగాలు ?
ఇటు తెలంగాణలోనూ 17 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గత నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన పోలీస్ కానిస్టేబుల్స్, SI అభ్యర్థులకు శిక్షణ పూర్తయింది. పాసింగ్ అవుట్ పేరేడ్ కూడా పూర్తి...