భారత స్వాతంత్ర్యానికి ముందు చట్టాలు
1) ఆగస్టు ప్రతిపాదనలు, 1940 ను ఎవరు రూపొందించారు ?
జ: లార్డ్ లిన్ లిత్ గో
2) 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్ కు అధినివేశ ప్రతిపత్తి (dominion status)తో పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తామని ఏ ప్రతిపాదనల్లో చెప్పారు ?
జ: ఆగస్టు ప్రతిపాదన
3) క్రిప్స్ రాయబారం కోసం భారతదేశానికి ఎప్పుడు వచ్చారు ?
జ: 1942 మార్చి 22న
4) రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాలు పాల్గొంటేనే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని ఎవరు ప్రకటించారు ?
జ: క్రిప్స్
5) క్రిప్స్ రాయబారం చెల్లని చెక్కులాంటిదని ఎవరు వర్ణించారు ?
జ: మహాత్మా గాంధీ
6) సీఆర్ ఫార్ములాను ఎవరు రూపొందించారు ?
జ: 1944లో సీ.రాజగోపాల చారి
7) భారత్ స్వాతంత్ర్యానికి ముస్లింలీగ్ ఆమోదం తెలపాలి. అలాగే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగం పంచుకోవాలి అని ఏ ఫార్ములా పేర్కొంది ?
జ: సీఆర్ ఫార్ములా
8) దేశ విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే హక్కు అన్ని పార్టీల...