జ్ఞాన్ పీఠ్ అవార్డులు (1965-2017)
రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో చేర్చిన ఏదైనా భారతీయ భాషా సాహిత్యంలో ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి జ్ఞాన్ పీఠ్ అవార్డును బహుకరిస్తారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సాహితీ
పురస్కారం ఇది. సాహూ జైన్ కుటుంబానికి (టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ ప్రచురణకర్తలు ) చెందిన భారతీయ జ్ఞాన్ పీఠ్ ట్రస్టు దీన్ని నిర్వహిస్తోంది. శ్రీమతి రమా జైన్ ఆలోచనలతో దీన్ని
ఏర్పాటు చేశారు. రూ.11 లక్షల రూపాయలను అవార్డు కింద బహుకరిస్తారు.
1965 - జి.శంకర కురూప్ - ఉడక్కుళై (మలయాళం)
1966- తారా శంకర్ బందోపాధ్యాయ - జ్ఞాన దేవత ( బెంగాలీ)
1967- కుప్పలి వెంకటప్పగౌడ పుట్టప్ప(కువెంపు) - శ్రీ రామాయణ దర్శనం (కన్నడం)
1967- ఉమాశంకర్ జోషి -నిషిత -(గుజరాతీ)
1968-సుమిత్రానంద్ పంత్-చిదంబర (హిందీ)
1969 -ఫిరాక్ గోరఖ్పురి-గుల్ - ఎ - నాగ్మా(ఉర్దూ)
1970-డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ - రామాయణ కల్పవృక్షం(తెలుగు)
1971- బిష్ణు డే స్మృతి - సత్తా భవిష్యత...