1) భారత ప్రజా ప్రతినిధులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరం జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు?
జ: 1918లో
2) రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది ఎవరు ?
జ: ఎం.ఎన్ రాయ్
3) స్వరాజ్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ?
జ: దాదా భాయ్ నౌరోజీ
4) 1921లో యంగ్ ఇండియా పత్రికలో ‘‘ భారత్ కు స్వాతంత్ర్యం అనేది భిక్ష కాదనీ, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదనీ, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ’’ అని ఎవరు అన్నారు ?
జ: మహాత్మాగాంధీ
5) 1924లో ఎవరి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను చెప్పారు ?
జ: మోతీలాల్ నెహ్రూ
( నోట్: మోతీలాల్ నెహ్రూయే తిరిగి 1928లో ఓ నివేదికను కూడా రూపొందించారు )
6) 1925లో బ్రిటీష్ పార్లమెంటులో కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టి ... ఐర్లాండ్ ప్రజలకు లాగే భారతీయులకూ శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పిం...