ఎన్నికల కమిషన్ ఏర్పాటు
1) భారత్ లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ?
జ: 2014 నాటికి 81.45 కోట్ల మంది
2) ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది ?
జ: రాజ్యాగంలోని XV వ భాగంలో 324అధికరణ ప్రకారం
3) ఎన్నికల సంఘం తన పని విధానానికి సంబంధించి ఎవరికి జవాబుదారీ తనంగా ఉంటుంది ? యేటా ఎవరికి నివేదిక సమర్పిస్తుంది ?
జ: ఎవరికీ జవాబుదారీ కాదు. ఎవరికీ నివేదిక సమర్పించదు
4) భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ?
జ: 1950 జనవరి 25
(నోట్: అందుకే ఈ రోజులు ఓటర్ల దినోత్సవంగా జరుపుతారు )
5) ప్రారంభంలో సిఈసి ఏకసభ్య కమీషన్ గా పనిచేసేది. దీన్ని ఎవరి హయాంలో త్రిసభ్య కమిషన్ గా మార్చారు ?
జ: 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం
6) తర్వాత మళ్ళీ 1990లో తిరిగి ఏకసభ్య కమీషన్ గా ఎవరి హయాంలో మారింది ?
జ: వి.పి.సింగ్ ప్రభుత్వం
7) 1993లో పి.వి నర్సింహారావు ప్రభుత్వం తిరిగి ఎంతమంది సభ్యుల కమిషన...