తెలంగాణ నదులు
1) రాష్ట్రంలో ప్రవహించే ముఖ్య నదులు ఏవి?
జ: గోదావరి, కృష్ణా, మంజీర, ప్రాణహిత, మూసీ, దిండి
2) గోదావరి నదికి గల పేరేమిటి?
జ. దక్షిణ గంగ
3) గోదావరి నది మొత్తం పొడవు ఎంత?
జ: 1465 కి.మీ.
4) గోదావరికి ఉపనదులు ఏమిటి?
జ: మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు
5) కృష్ణానది పొడవు ఎంత?
జ: 1400 కి.మీ
6) మంజీరా నదిపై ఏ ప్రాజెక్టును నిర్మించారు?
జ: నిజాంసాగర్ ప్రాజెక్టు
7) మున్నేరు నది జన్మస్థానం ఎక్కడ ?
జ: మహబూబాబాద్
8) మూసీనది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది?
జ: వాడపల్లి
9) హైదరాబాద్ ఏ నది ఒడ్డున కలదు?
జ: మూసీనది
10) దిండి నది ఏ జిల్లాలో ఉన్నది?
జ: మహబూబ్ నగర్
11) గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తోంది ?
జ: బాసర
12) మంజీరా నది ఏ కొండల్లో పుడుతోంది ?
జ: బాలా ఘాట్
13) రాష్ట్రంలో కృష్ణా నది ఎక్కడ ప్రవేసిస్తుంది ?
జ: మక్తల్ మండలంలోని తంగడి దగ్గర
14) కుంతాల, పొచ్చెర, గా...