GST సర్వస్వం – 60 ప్రశ్నలు, సమాధానాలు
1) మన దేశంలో GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ) గురించిన ప్రస్తావన తొలిసారిగా ఏ బడ్జెట్ లో వచ్చింది ?
జ: 2010
2) 2010లో ఎవరి అధ్యక్షతన GST కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేశారు ?
జ: నందన్ నీలేకని
3) జీఎస్టీ బిల్లుకు లోక్ సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
జ: 2015 మే 6
4) GST బిల్లుకు రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
జ: 2016 ఆగస్టు 3
5) జీఎస్టీ బిల్లుకు 16 రాష్ట్రాల ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు ?
జ: 2016 సెప్టెంబర్ 2 నాడు
6) GST రూపొదించడానికి ఎవరి నాయకత్వంలోని పార్లమెంట్ స్థాయీ సంఘం రాజ్యాంగ సవరణలకు సూచనలు చేసింది ?
జ: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా
7) GST విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఎంపవర్ కమిటీ ఛైర్మన్లుగా ఎవరెవరు వ్యవహరించారు ?
జ: జమ్మూకశ్మీర్ ఆర్థికమంత్రి అబ్దుల్ రహీవ్, బీహార్ మంత్రి సుశీల్ మోదీ, కేరళ మంత్రి కేఎం ...