యూరోపియన్ల రాక
1) భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టినది ఎవరు?
జ) వాస్కోడిగామా (1498 మే 17)
2) వాస్కోడిగామా ఎక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ప్రభువు ఎవరు ?
జ: భారత్ పశ్చిమతీరంలోని కాలికట్ కు. రాజు జామొరిన్
3) వాస్కోడిగామాకి సహాయపడిన అరబ్ వ్యాపారి ఎవరు ?
జ: అబ్దుల్ మజీద్
4) వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు?
జ) 1502 అక్టోబర్ 30.
5) వాస్కోడిగామా ఏ వ్యాధితో చనిపోయాడు ?
జం కోచిన్ లో మలేరియా వ్యాధితో
6) ప్రపంచాన్ని చుట్ట వచ్చిన మొదటి నావికుడు ఎవరు ?
జ: ఫ్రాన్సిస్ డ్రేక్
7) పోర్చుగీసు వారు ఎస్టోడ-డ-ఇండియా అనే కంపెనీ పేరుతో తూర్పు దేశాలతో వ్యాపారం మొదలుపెట్టారు. అయితే మొదటి వర్తక స్థావరం ఏది ?
జ: సూరత్
8) పోర్చుగీసువారి మొదటి, రెండో ప్రధాన స్థావరాలు ఏవి ?
జ: కొచిన్ మొదటిది, గోవా రెండోది
9) శ్రీకృష్ణ దేవరాయులుతో మైత్రి సంధి చేసుకున్న పోర్చుగీసు గవర్నర్ ఎవరు ?...