సాధారణ ఎన్నికలు – హైదరాబాద్ రాష్ట్రం
1) హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
జ) 1952 ఫిబ్రవరిలో
2) 1952లో హైదరాబాద్ రాష్ట్ర్రంలో ఉన్న మొత్తం జిల్లాలు ఎన్ని?
జ) 16 జిల్లాలు
3) హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండేవి ?
జ: 142 నియోజకవర్గాలు, రిజర్వు అభ్యర్థులు 33 మంది మొత్తం 175 మంది శాసనసభ్యులు
4) హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందింది ?
జ: 93 సీట్లు
5) కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
జ) బూర్గుల రామకృష్ణారావు.
6) భారత దేశంలోనే అత్యధిక మెజార్టితో గెలుపొందినవారు ఎవరు?
జ) రావి నారాయణరెడ్డి (3,09,162 ఓట్ల మెజార్టీ) భారత దేశంలోనే అత్యధిక మెజారిటీ
7) ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఏ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది?
జ) బ్రాహ్మణ వర్సెస్ రెడ్డి.
8) హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1952 మార్చి 6న బూర్గుల రామక్రి...