ఆహార భద్రత
1) ఆహార భద్రతా పథకం కింద నిరుపేదలకు ఎప్పటి నుంచి బియ్యం పథకం అమలైంది ?
జ: 2015 జనవరి నుంచి
2) ఆహార భద్రతా పథకంలో మనిషికి ఎన్ని కిలో బియ్యం ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది ?
జ: ఆరు కిలోలు (కిలో రూపాయి చొప్పున) (ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ)
3) గతంలో మనిషికి ఎన్నికిలోల బియ్యం ఇచ్చేవారు ?
జ: మనిషికి నాలుగు కిలోలు (కుటుంబానికి 20 కిలోలకు మించి ఇచ్చేవారు కాదు)
4) అంత్యోదయ అన్నయోజన (AAY) కుటుంబాలకు ఎంత బియ్యం ఇస్తారు ?
జ: రూపాయికి కిలో చొప్పున 35 కిలోల బియ్యం
5) ఆహార భద్రతా కార్డులు పొందడానికి గ్రామాల్లో ఆదాయ పరిమితి ఎంత ?
జ: రూ.1.50 లక్షలు (గతలో 60 వేలు)
6) ఆహార భద్రతా కార్డులు పొందడానికి పట్టణాల్లో ఆదాయ పరిమితి ఎంత ?
జ: రూ.2లక్షలు ( గతంలో 75 వేలు)
7) ఆహార భద్రతా కార్డులు పొందడానికి మాగాణి, మెట్ట భూమి ఎంత ఉండాలి ?
జ: మాగాణి - 2.5 ఎకరాలు, మెట్ట భూమి - 5 ఎకరాలు
8) 2015 జనవరిలో ప్రభుత్వం...