మతపరమైన ఉద్యమాలు
1) శంకరాచార్య ఎక్కడ జన్మించాడు?
జ) కేరళలోని కాలడి
2) విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్య ఎక్కడ జన్మించారు?
జ) శ్రీపెరంబుదూర్.
3) రామ్ రహీం- ఒకే నాణెం యొక్క రెండు రూపాలని చెప్పిందెవరు ?
జ) కబీర్.
4) సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?
జ) ఆది గ్రంధ్.
5) హరే రామ, హరే కృష్ణ నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జ) చైతన్యుడు.
6) ఔరంగజేబు ఉరితీయించిన సిక్కుల గురువు ఎవరు ?
జ: గురు తేజ్ బహదూర్
7) ఖల్సాను ఏర్పాటు చేసి సిక్కులను సైనిక తెగగా వ్యవస్థీకరించింది ఎవరు ?
జ: పదో గురువు గురు గోవింద్ సింగ్
8) మోక్షమార్గానికి ఉత్త మార్గం ‘రాగ మార్గం’ అని సందేశాన్ని ప్రచారం చేసింది ఎవరు ?
జ: చైతన్యుడు
9) సూర సాగర్; సూర సారావళి గ్రంథాలను రాసినది ఎవరు ?
జ: సూరదాసు (వల్లభాచార్యుడి శిష్యుడు)
10) రాజస్థాన్ లో కృష్ణ ఉపాసనను ప్రచారం చేసిన భక్తురాలు ఎవరు ?
జ: మీరాబాయి
11) అసోంలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసిందెవరు ...