మున్సిపల్ ఖాళీలపై మంత్రి KTR సమీక్ష, అవసరమైన పోస్టులు గుర్తించాలని ఆదేశాలు
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే అంశంపై మంత్రి KTR ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఇప్పుడున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆ తర్వాత ఎంతమంది అవసరం అవుతారో గుర్తించి కొత్త సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇందులో ఇంజనీరింగ్, మౌలిక సదుపాలయ విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఖాళీల భర్తీలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు ఏరియాల్లోని మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోనూ సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుందనీ అందుకోసం ప్లానింగ్ రెడీ చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శ అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు మంత్రి కేటీఆర్.
మున్సిపాలిటీల్లో మ...