సింధూ సంస్కృతి
1) సంస్కృతి అనే పదం మొదటిసారిగా ఎక్కడ కనిపించింది ?
జ: ఇంగ్లీషులో ( Culture) (16 వ శతాబ్దంలో)
2) భారతదేశంలో సంస్కృతిని ఎలా వర్ణిస్తారు ?
జ: భిన్నత్వంలో ఏకత్వం
3) భారతదేశాన్ని జాతుల ప్రదర్శనశాలగా వర్ణించిన వారెవరు ?
జ: స్మిత్
4) సింధు (హరప్పా) సంస్కృతి లక్షణం ఏంటి ?
జ: పట్టణ నిర్మాణ ప్రణాళిక
5) సింధూ సంస్కృతిలో చెప్పుకోదగిన ప్రణాళికాబద్జమైన వ్యవస్థ ఏది ?
జ: మురుగు కాల్వల వ్యవస్థ
6) సింధు నాగరికత కాలంలో ప్రధానమైన పురుష దేవత ఎవరు ?
జ: పశుపతి మహాదేవుడు ( శివుడు)
7) పశుపతి మహాదేవుడు చుట్టూ ఉండే నాలుగు జంతువులు ఏవి ?
జ: ఏనుగు, పులి, ఖడ్గ మృగం, దున్న
8) పశుపతి మహాదేవుడు పాదాల దగ్గర ఉండే జంతువులు ఏవి ?
జ: రెండు జింకలు
9) సింధు ప్రజల స్త్రీ దేవత ఎవరు ?
జ: ధరణీ మాత (అమ్మతల్లి)
10) సింధు ప్రజలు ఏ పంటలు పండించే వారు ?
జ: గోధుమలు, వరి, బార్లీ, పత్తి
11) సింధు ప్రజలు ఎక్కువగా ఏయే దేశ...