తెలంగాణలో అస్తిత్వ ఉద్యమాలు
1) గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 1901లో హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించింది ఎవరు ?
జ: మునగాల సంస్థానపు దివాన్ అయిన కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాధరావు
2) హన్మకొండలో స్థాపించబడిన గ్రంథాలయం ఏది ?
జ: రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం (1904లో)
3) ఉస్మానియాలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం స్థాపించిన సంస్థ ఏది ?
జ: అంజుమాన్ తారక్ ఇ ఉర్దూ ( మౌల్వీ అబ్దుల్ హక్)
4) నిజాం రాజ్యంలో దళితుల తరపున ఉద్యమం చేపట్టింది ఎవరు ?
జ: మాదిరి భాగ్యరెడ్డి వర్మ
4) అంటరానితనం నేరమంటూ వారికి భాగ్యరెడ్డి వర్మ ఏమని పేరు పెట్టారు?
జ: ఆది హిందువులు
5) భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏది ?
జ: జగన్ మిత్ర మండలి
6) జగన్ మిత్ర మండలిలో ఎవరెవరికి సభ్యత్వాన్ని నిరాకరించారు ?
జ: మద్యపానం సేవించేవారు, సిగరెట్టు తాగే వారు
7) హిందువుల్లో చైతన్యం తెచ్చేందుకు భాగ్యరెడ్డి వ...