తెలంగాణ ప్రాజెక్టులు – QUICK REVISION
1) నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ :
ఈ ప్రాజెక్టుని నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం దగ్గర నిర్మించారు.
1955, డిసెంబర్ 10న ప్రారంభమైంది.
నాగార్జున సాగర్ డ్యామ్ పొడవు 1500 మీ ఉండగా ఎత్తు 124 మీ.
ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం 2.15 లక్షల చదరపు కిలోమీటర్లు
దీనికి కింద 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుంది.
2) శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు
దీన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు దగ్గర గోదావరి నదిపై నిర్మించారు.
ఈ ప్రాజెక్టుకి 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
1978లో నిర్మాణం పూర్తయింది. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి.
3) ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఇది
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రావులపల్లి దగ్గర నిర్మించారు. 11 టీఎంసీల సామర్థ్యంతో 1984లో ప్రాజెక్ట్ నిర్మాణం...