పదో తరగతి పాసయ్యాక ఏం చేయాలి… ?
ప్రతి విద్యార్థి జీవితంలోనూ కీలకమైన టెన్త్ క్లాసే. ఎందుకంటే మన భవిష్యత్ జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది టెన్త్ తర్వాత నిర్ణయించుకోవాలి. పదో తరగతి దాకా తల్లిదండ్రులు, ఉపాధాయుల సంరక్షణలో ఉంటారు. పైగా అన్ని సబ్జెక్టులు చదువుకుంటారు. కానీ టెన్త్ దాటితే ... సైన్స్, ఆర్ట్స్, కామర్స్, టెక్నికల్ ... ఏరంగాన్ని ఎంచుకోవాలన్న ఇక్కడే డిసైడ్ చేసుకోవాల్సిన టైమ్. మీరు 15-16 యేళ్ళ వయసులో ఉంటారు కాబట్టి... మీ అంతట మీరు నిర్ణయం తీసుకునే వయసు కూడా కాదు. అందుకే పెద్దలు, ఉపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణుల సలహాలు తీసుకొని భవిష్యత్ పై ముందడుగు వేయాలి. అన్నింటికంటే మనకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి.
మనలో చాలామంది లెక్కలకు భయపడి MPCని దూరం చేసుకొంటారు. అలాగే సోషల్, బయాలజీ ...ఇలా టెన్త్ వరకూ ఏదో ఒక సబ్జెక్ట్ లో చాలామందికి భయాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని... ఇంటర్ లో మనం ...