భారత దేశ క్షిపణి వ్యవస్థ
1) సమగ్ర క్షిపణి అభివృద్ది కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది?
జ: 1983 అబ్దుల్ కలాం ఆద్వర్యంలో
2) క్షిపణి పితామహుడని ఎవరిని అంటారు?
జ: అబ్దుల్ కలాం
3) మనదేశ రక్షణ వ్యవస్థలో అత్యున్నత సంస్దగా దేనిని పిలుస్తారు?
జ: DRDO ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్)
4) మనదేశంలో తయారు చేయబడిన తొలి క్షిపణి ఏది?
జ: పృద్వీ, 1988 BDL సంస్ద రూపొందించింది
5) ఏదైనా క్షిపణి యొక్క లక్ష్య పరిధి 5 వేల కి.మీ. దాన్ని దాటితే ఏమంటారు?
జ: ఖండాంతర క్షిపణి (బాలిస్టిక్)
6) అగ్ని క్షిపణుల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరు?
జ: టెస్సీ ధామస్
7) టెస్సీ ధామస్ కు గల ఇంకో పేరేంటి?
జ: మిస్సైల్ మహిళ.
8) అమెరికా దగ్గరున్న పేట్రియాటిక్ క్షిపణులతో పోల్చగల క్షిపణి ఏది?
జ: ఆకాశ్
9) మనదేశపు అణుజలాంతర్గామి యుద్దనౌక INS అరిహంత్ కి ప్రధాన ఆయుధంగా వాడే క్షిపణి ఏది?
జ: సాగరిక.
10) మన...