1953 తెలంగాణ రాష్ట్రం – ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
1) కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు?
జ) విశాలాంద్ర.
2) ఆంధ్రులు కంటే గొప్ప కవులు తెలంగాణలో ఉన్నారని అన్నవారు ఎవరు?
జ) సురవరం ప్రతాపరెడ్డి
3) 350 మంది తెలంగాణ కవుల వివరాలతో ‘గోల్కొండ కవుల సంచిక‘ ను ప్రచురించనది ఎవరు ?
జ: సురవరం ప్రతాపరెడ్డి
4) ఆంధ్ర రాష్ట్ర్రం ఎప్పుడు ఏర్పడింది?
జ) 1953 అక్టోబర్ 1
5) విశాలాంధ్రను తిరస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాటు భావనను మొదటగా తీసుకొచ్చింది ఎవరు?
జ) కె.వి.రంగారెడ్డి ( తెలంగాణ పితామహుడు అంటారు)
6) 1938లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఏ ఉద్యమం జరిగింది?
జ) వందేమాతర ఉద్యమం.
7) వందే మాతరం ఉద్యమంలో పాల్గొని డిబార్ అయిన ఓయూ విద్యార్థులు మొదట ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించారు ?
జ: ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖ పట్నం)
8) అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు?
జ) కట్టమంచి రామలింగారెడ్డి.
9) ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్...