శాతవాహనులు – 1
1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు?
జ: ఇండికాలో-మెగస్తనీసు
2) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు?
జ: సిముఖుడు
3) మౌర్యులకు సామంతుడు ఎవరు?
జ: సిముఖుడు
4) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
జ: కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
5) కోటి లింగాలలో ఏ నాణేలు లభించాయి?
జ: సమగోప, గోభద్ర, నారాణ, కంవమసర నాణేలు
6) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి?
జ: రోమన్ సామ్రాజ్యం
7) శాతవాహనుల కాంలో ఏ విదేశీ నాణేలు లభించాయి?
జ: మస్తులాపూర్ లో రోమన్ నాణేలు (కరీంనగర్ జిల్లా)
8) కోటిలింగాల శాతవాహనుల రాజధాని అనడానికి ఆధారాలు ఏంటి?
జ: కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, పెద్దబంకూర్, కోటిలింగాలలో నాణేలు, బౌద్దస్తూపాలు బయటపడ్డాయి
9) శాతవాహనుల చరిత్రకు ఆధారమైన గ్రంథాలు ఏంటి?
జ: మత్స్యపురాణం - వాయుపురాణం
10) ఎంతమంది రాజులను ఆంధ్రభృత్యులు అన్నారు?
జ: 30 మంది
11) కాళిదాసు రచించిన రచనలు...