టీ-హబ్, కొత్త ఐటీ విధానం
1) దేశంలోనే అతిపెద్ద ఇన్ క్యూబేటర్ ’టి-హబ్’ ను ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2015 నవంబర్ 5 నుంచి
2) టిహబ్ భవనానికి ఏమని పేరు ?
జ: కాటలిస్ట్
3) టిహబ్ ను ఎక్కడ ఎవరు ప్రారంభించారు ?
జ: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ సెంటర్ లో.. గవర్నర్ నరసింహన్
4) టిహబ్ కు ఎవరు భాగ్యస్వాములుగా ఉన్నారు ?
జ: మైక్రోసాఫ్ట్, గూగుల్, సైయంట్
5) ప్రపంచంలోనే స్టార్టప్ లకు భారత్ నాలుగో అతిపెద్ద కేంద్రం. అయితే మిగతా
3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి ?
జ: అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్
6) హైదరాబాద్ లో ఎంత శాతం స్టార్టప్ లు పనిచేస్తున్నాయి ?
జ: 8 శాతం
7) కొత్త ఐటీ పాలసీని ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు ?
జ: 2016 ఏప్రిల్ 4న, హైదరాబాద్ లోని HICC లో
8) ఎన్ని పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
జ: ఐటీ పాలసీతో పాటు, మరో నాలుగు పాలసీలు
9) రాష్ట్రంలో స్టార్టప్స్ కి చేయూత ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్ పాల...