Friday, September 20

Tag: ఎస్ఐ ఉద్యోగాల ఫలితాలు

జూన్ మొదటి వారంలో పోలీస్ ఉద్యోగాల ఫలితాలు

జూన్ మొదటి వారంలో పోలీస్ ఉద్యోగాల ఫలితాలు

Latest News, Latest Notifications
జూన్ మొదటి వారంలో పోలీస్ ఉద్యోగాల ఫలితాలను వెల్లడించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది. 18 వేలకు పైగా పోస్టులకు సంబంధించిన పోలీస్ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. కానిస్టేబుల్ తో పాటు ఎస్ ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది బోర్డు. ఈసారి ఎక్కువమంది అభ్యర్థులకు చేకూర్చేలా బోర్డు ప్రయత్నిస్తోంది. చాలామంది అభ్యర్థులు SI, PC ఎగ్జామ్స్ రెండూ రాశారు. వీళ్ళల్లో కొందరు SI పోస్టును పొందితే కానిస్టేబుల్ పోస్టులను వదులుకునే అవకాశం ఉంది. దాంతో అవి ఖాళీగా మిగిలిపోయే అవకాశముంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఈ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. గతంలో 2017లో ఇలాగే 700కు పైగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మిగిలిపోయాయి. మళ్లీ వీటిని భర్తీ చేయాలంటే ప్రభు