ఆసరా ఫించన్లు (ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు)
1) వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆసరా. దీనికింద నెలకు ఎంత మొత్తాన్ని ఇస్తారు ?
జ: ఒక్కో లబ్దిదారుడికి నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500
2) ఆసరా ఫించన్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు ?
జ: 2014, నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో
3) HIV బాధితులు, హెచ్ఐవీ బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు ఎంత మొత్తం ఆసరా కింద చెల్లిస్తారు?
జ: రూ. 1000
4) రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది అంగవైకల్యంతో బాధపడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ?
జ: 2.97 శాతం మంది
5) బీడీ కార్మికులకు ఫించన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.188 కోట్లు
6) ఆసరా పథకం కింద సర్కార్ ఎంత మొత్తం ఖర్చు చేసింది ?
జ: రూ.4,700 కోట్లు
7) తెలంగాణలో ఆసరా పథకం కింద ఎంతమంది లబ్ది పొందుతున్నారు ?
జ: 37,65,304 మంది
8) వృద్ధులకు...