సుప్రీంకోర్టు

1) భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఏ అధికరణం ప్రకారం ఏర్పడింది ?
జ: 124వ అధికరణ
2) సుప్రీంకోర్టు నిర్మాణం, పని చేయు విధానం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
జ: అమెరికా నుంచి
3) రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774లో మనదేశంలో మొదటిసారి సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్సాటుచేశారు?
జ: కలకత్తాలో
4) ఏ చట్టం ద్వారా సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు ?
జ: 1935 భారత ప్రభుత్వ చట్టం
(నోట్: రాజ్యాంగం అమలులోకి వచ్చాక ఫెడరల్ కోర్టును తిరిగి యస్.సి.గా మార్చారు )
5) సుప్రీంకోర్టు .మన దేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన అత్యున్నత న్యాయస్ధానంగా పనిచేయుటకు గల కారణాలేవి ?
జ: ఎ.భారత్ సమాఖ్య విధానం అనుసరించడం
బి.ప్రాధమిక హక్కుల సంరక్షకులుగా వ్యవహరించడం
సి.భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం
డి.రాజ్యాంగాధిక్యతను కాపాడటం
ఇ.రాజ్యాంగానికి అర్ధ వివరణ ఇవ్వడం.
6) సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ?
జ: రాష్ట్ర్రపతి
7) సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ?
జ: పార్లమెంటు
8) సుప్రీంకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య ఎంత ?
జ: 27 మంది ( 31వరకూ పెంచుకోవచ్చు )
9) రాష్ట్ర్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు హైకోర్టులో ఎన్నేళ్ళు జడ్జిగా పనిచేసి ఉండాలి ?
జ: హైకోర్టు కనీసం 5 యేళ్ళు
10) సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించాలంటే హైకోర్టులో ఎన్నేళ్ళకు తగ్గకుండా న్యాయవాదిగా పనిచేసి ఉండాలి ?
జ: 10 యేళ్ళు
11) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కనీస వయస్సు ఎంత ?
జ: నిర్ణయించలేదు
12) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత ?
జ: 65 యేళ్ళు
13) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది ?
జ: భారత పార్లమెంటుకు
14) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును ఎన్నేళ్ళకు పెంచాలని లా కమీషన్, రాజ్యాంగ పున సమీక్ష కమీషన్లు సూచించాయి ?
జ: 67 యేళ్ళకు
15) న్యాయమూర్తులను నియమించేటప్పుడు ఎవరి నేతృత్వంలోని కోల్లేజియమ్ ను తప్పనిసరిగా సంప్రదించాలని 1993, 1999ల్లో సుప్రీంకోర్టు తీర్సునిచ్చింది ?
జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
16) సీనియర్ న్యాయమూర్తులను కాదని ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులైన సందర్భాలు ఎప్పుడెప్పుడు జరిగాయి ?
జ: 1973లో A.N. రే, 1977లో M.H. బేగ్ ను
17) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: H.J. కానియా
18) అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు ?
జ: K.N సింగ్
19) ఎక్కువకాలం చేసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ?
జ: జస్టిస్ Y.V. చంద్రచూడ్
20) సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ?
జ: ఫాతిమా బీబీ.
21) మొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: K.G. బాలకృష్ణన్
22) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు ?
జ: రాష్ట్ర్రపతి
23) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు ?
జ: రాష్ట్రపతికి
24) అసమర్ధత, దుష్ర్పవర్తన కారణాలపై న్యాయమూర్తులను ఎవరు పదవి నుంచి తొలగించవచ్చు ?
జ: రాష్ట్ర్రపతి (పార్లమెంటులో 2/3 వంతు మెజార్టీతో )
25) 124(4)రూల్ ప్రకారం న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే తీర్మాన నోటీస్ పై కనీసం ఎంతమంది ఎంపీలు సంతకాలు చేయాలి ?
జ: 50 మంది ( 14రోజుల ముందు నోటీసివ్వాలి )
26) ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని 2వ సభ కూడా ఎంత మెజార్టీతో ఆమోదించినప్పుడే రాష్ట్ర్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగిస్తారు ?
జ: 2/3 వంతు మెజార్టీతో

27) 1990లో తమిళనాడుకు చెందిన 'సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన పేరేంటి ?
జ: జస్టిస్ వి.రామస్వామి
(నోట్: 1991లో తగిన మెజార్టీ లేకపోవడం వల్ల ఈ తీర్మానం వీగిపోయింది. కానీ తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు.)
28) న్యాయమూర్తులను తొలగించే పద్దతిని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించినాము ?
జ: అమెరికా