జూన్ 15 దాకా వేసవి సెలవులు

జూన్ 15 దాకా వేసవి సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళ వేసవి సెలవులను జూన్ 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా సెలవులను పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. అప్పటి దాకా విద్యాసంస్థలు తెరవకుండా రీజినల్ జాయింట్ డైరెక్టర్స్, జిల్లా విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలని డైరెక్టర్, విద్యాశాఖ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. స్కూళ్ళతో పాటు డైట్ కాలేజీలకు కూడా సెలవులను జూన్ 15 వరకూ పొడిగించారు