Wednesday, April 1

రాష్ట్రంలో ఎవరి దగ్గర ఏ మంత్రిత్వ శాఖ ?

రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ప్రస్తుతం కేబినెట్ సంఖ్య 18మందికి చేరింది.  కొత్త మంత్రులకు శాఖలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు.  కొన్ని శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.  అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఉందో ఒక్కసారి చూద్దాం

1) ముఖ్యమంత్రి కేసీఆర్ : నీటిపారుదల, రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రణాళిక, గనులు, శాంతి భద్రతలు

2) మహమూద్ అలీ : హోంశాఖ

3) కె.తారక రామారావు : పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి

4) తన్నీరు హరీశ్ రావు : ఆర్థికశాఖ

5) అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: అటవీ, పర్యావరణం

6) తలసాని శ్రీనివాస్ యాదవ్ : పశు సంవర్ధక శాఖ, మత్య్స, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ

7) గుంటకండ్ల జగదీశ్ రెడ్డి : విద్యుత్ శాఖ

8) ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

9) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి: వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్

10) కొప్పుల ఈశ్వర్ : షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం

11) ఎర్రబెల్లి దయాకర్ రావు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా

12) వి.శ్రీనివాస్ గౌడ్: అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటయ, సాంస్కృతిక శాఖ, పురావస్తు

13) వేముల ప్రశాంత్ రెండ్డి : రోడ్లు, భవనాలు, శాసనసభ

14) చామకూర మల్లారెడ్డి : కార్మిక ఉపాధి, కర్మాగారాలు, ఉపాధి కల్పన

15) పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి : విద్య

16) గంగుల కమలాకర్ : బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

17) సత్యవతి రాథోడ్ : స్త్రీ శిశు, గిరిజన సంక్షేమం

18) పువ్వాడ అజయ్ కుమార్ : రవాణా శాఖ