Monday, September 23

కోపరేటివ్ బ్యాంకుల్లో 62 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు

తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 62 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పాత 10 జిల్లాలకు సంబంధించి లోకల్ ఏరియాగా గుర్తిస్తారు.

విద్యార్హతలు:

ఏదేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి (01.09.2019 లోపు). తెలుగు తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా అవసరం

Also Read : బీసీ గురుకులాల్లో జూనియర్ అసిస్టెంట్స్

వయస్సు:

2019 సెప్టెంబర్ 1 నాటికి 20 - 28 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి. అంటే 02 సెప్టెంబర్ 1991 నుంచి 01 సెప్టెంబర్ 1999 లోపు పుట్టి ఉండాలి

(నోట్: ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 5 యేళ్ళు, బీసీలకు 3యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు, ఎస్సీ, ఎస్టీల్లోని దివ్యాంగులకు 15యేళ్ళు, బీసీల్లోని దివ్యాంగులకు 13యేళ్ళ పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది )

ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు:

SC/ST/PWD/EXM - రూ.300

ఇతరులు (బీసీ, జనరల్ ) రూ.600

ఎంట్రన్స్ టెస్ట్: 190 మార్కులకు (ఇంగ్లీషులో మాత్రమే ఉంటుంది )

1) General/ Financial Awareness - 50 Qns. 50 Marks - 35 Minutes
2) General English - 40 Qns, 40 Marks - 35 Minutes
3) Reasoning Ability & Computer Aptitude. - 50 Qns - 50 Marks - 45 Minutes
4) Quantitative Aptitude - 50 Qns - 50 Marks - 45 Minutes
Total : 190 Questions - 190 Marks - 160 Minutes

ప్రతి తప్పు జవాబుకి 0.25 మార్కులు తీసివేయబడును. ఆన్ లైన్ లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ఆన్ లైన్ రిటన్ టెస్ట్ ను IBPS సంస్థ ద్వారా నిర్వహిస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

ఎగ్జామినేషన్ సెంటర్స్:

1) హైదరాబాద్

2) కరీంనగర్

3) ఖమ్మం

4) నల్లగొండ

5) నిజామాబాద్

6) వరంగల్

అప్లికేషన్లు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేయడానికి : 8 సెప్టెంబర్, 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకూ

అప్లికేషన్ ఫీజులు ఆన్ లైన్ లో చెల్లించడానికి : 8 సెప్టెంబర్, 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకూ

ఆన్ లైన్ లో ఎగ్జామ్ : 02 నవంబర్ 2019 నాడు నిర్వహించే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి:

స్టాఫ్ అసిస్టెంట్స్ పోస్టుల నోటిఫికేషన్

పోస్టులకు ఆన్ లైన్ లో అప్లయ్ చేయడానికి ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి

నేరుగా అప్లయ్ చేయడానికి లింక్ ఇది