Thursday, March 21

SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ నోటిఫికేషన్

ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ 2019 నోటిఫికేష్ విడుదలైంది. ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని SSC అధికారులు వెల్లడించారు.

ఏయే పోస్టులు ?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉంటాయి

1) లోయర్ డివిజన్ క్లర్క్స్

2) జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్స్

3) పోస్టల్ అసిస్టెంట్స్

4) సార్టింగ్ అసిస్టెంట్స్

5) డేటా ఎంట్రీ ఆపరేటర్స్

విద్యార్హతలు:

1 నుంచి 4 - పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమానం

5 వ పోస్టు - డేటా ఎంట్రీ ఆపరేటర్ ( C& AG) కి మాత్రం మ్యాథమెటిక్స్, సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్ లేదా తత్సమానం

వయస్సు:

18-27 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ( 2019 ఆగస్టు 1 నాటికి )

ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

టైర్ 1, 2, 3 పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైర్ 1 విధానం

1) ఇంగ్లీష్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు

2) జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు

3) క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు- 50 మార్కులు

4) జనరల్ అవేర్ నెస్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు

మొత్తం : 100 ప్రశ్నలు - 200 మార్కులు - 60 నిమిషాలు

ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పైన పేర్కొన్న జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్ నెస్ ప్రశ్నలు ఇంగ్లీ, హిందీ మీడియంలో ఉంటాయి.

దరఖాస్తులకు చివరి తేది: 5 ఏప్రిల్ 2019

ఫీజులు చెల్లించడానికి చివరి తేది: 7 ఏప్రిల్ 2019

టైర్ - 1 ఎగ్జామ్ : జులై 1-26, 2019

టైర్ - 2 ఎగ్జామ్ (Descriptive) - 29 సెప్టెంబర్ 2019

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి:

SSC NOTIFICATION