Monday, March 30

పది పరీక్షలు వాయిదా వేయాలి: హైకోర్టు ఆదేశం

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో జరిగే పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపు శనివారం జరగాల్సిన పరీక్షను యధాతథంగా నిర్వహించనున్నారు. ఈనెల 30 సోమవారం నుంచి జరగాల్సిన మిగతా పరీక్షలను వాయిదా పడ్డాయి. ఈనెల 23 నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రీషెడ్యూల్ చేసిన టెన్త్ పరీక్షలను ఎప్పటి నుంచి నిర్వహించేది ఈనెల 29న చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే నెల 6 వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సోమవారం నుంచి జరిగే అన్ని పరీక్షలు వాయిదా పడినట్టే.