Sunday, June 24
Log In

SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయబోయే 18 వేల పోలీస్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించబోతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నుంచి అనుమతి కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీసుకుంది. Online పరీక్షలతో ఫలితాలను తొందరగా వెల్లడించే అవకాశం ఉండటంతో పాటు, లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహించే ఛాన్స్ ఉంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలతో పాటు జైళ్ళు, అగ్నిమాపక శాఖలో పోస్టులకు కూడా కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రాబోతోంది. ఫిజికల్ టెస్టుల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. దీనిపై ఉన్నతాధికారుల కమిటీ చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి ఇంగ్లీష్ తో పాటు తెలుగుకు కూడా వెయిటేజ్ ఇవ్వబోతున్నారు.

వయో సడలింపు మాటేంటి ?
ఎంతోమంది అభ్యర్థులు ఆశగా చూస్తున్నది ఈసారి పోలీస్ ఉద్యోగాలకు వయో సడలింపు ఉంటుందా... ఉండదా... అని... చాలామంది ఆందోళన పడుతున్నారు.  అయితే దీనిపై రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు ఇప్పటికే ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ కోరారు. రెండున్నర నెలలుగా ఈ విషయం పెండింగ్ లో ఉంది. అయినప్పటికీ... నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వయో సడలింపునకు ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

నోటిఫికేషన్ ఎప్పుడు ?
పోలీసుల నియామకానికి సంబంధించిన అంతర్గత నిబంధనలపై జీవోలను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ ప్రక్రియను కూడా రిక్రూట్ మెంట్ బోర్డు ప్రారంభించింది. జూన్ 2 కల్లా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

PC/SI ఉద్యోగాలకు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్టులను TELANGANA EXAMS ఇప్పటికే మొదలుపెట్టింది. 

PC/ SI ఆన్‌లైన్‌ మాక్ టెస్టులు, ఇంటెన్సివ్ కోచింగ్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...
https://telanganaexams.com/si-pc-mocktests/

మీ ఊర్లోనే PC/SI ఆన్ లైన్ గ్రాండ్ టెస్టులు రాసుకునే అవకాశం కల్పిస్తాం... అందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ ఊర్లో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ ను సంప్రదించి... వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళ వివరాలతో 703 6813 703 కి SMS/ వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి. మేం కాంటాక్ట్ చేస్తాం.

 

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *