Thursday, January 23

SI అభ్యర్థులకు అక్టోబర్ 14 నుంచి శిక్షణ

రాష్ట్రంలో SI పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 14 నుంచి శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వీలైతే ఇంకా ముందే ప్రారంభిస్తామని చెబుతున్నారు. 1272 పోస్టులకు సంబంధించి జులై 13న అభ్యర్థుల కటాఫ్ మార్కులను ప్రకటించింది TSLPRB. అంతేకాకుండా జిల్లా కేంద్రాల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు.

పోలీస్ కానిస్టేబుల్స్ రిజల్ట్ పై రాని క్లారిటీ

ఇక పోలీస్ కానిస్టేబుల్స్ ఫైనల్ రిజల్ట్స్ పై అధికారులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మొత్తం 16,925 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫైనల్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన దాదాపు 80 వేల మంది అభ్యర్థులు మెరిట్ లిస్ట్ కోసం 3 నెలలుగా ఎదురు చూస్తున్నారు. 15 నెలలుగా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కొనసాగుతున్నా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇటీవలే కొందరు నిరుద్యోగ అభ్యర్థులు డీజీపీ ఆఫీసుకు అభ్యర్థన కూడా ఇచ్చారు. ఈ ఉద్యోగాల రిజల్ట్స్ పై నమ్మకం పెట్టుకొని ఏ కొలువూ చేయకుండా ఖాళీగా ఉన్నారు చాలామంది నిరుద్యోగులు. ఏదో ఒకటి తేలితే కనీసం ప్రైవేటు జాబ్ అయినా చూసుకుంటామని చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం కానీ అటు TSLPRB కూడా రిజల్ట్స్ పై ఎలాంటి ప్రకటన చేయడం లేదు.