Monday, September 24
Log In

18వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు, వయస్సు, విద్యార్హతలు, పూర్తి నోటిఫికేషన్ వివరాలు

మొత్తం ఉద్యోగాలు : 18,428
కానిస్టేబుళ్ళు : 16,925
సబ్ ఇన్స్‌పెక్టర్లు : 1,272

మునుపెన్నడూ లేనంతగా భారీ స్థాయిలో ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకమండలి ( TSLPRB) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక విపత్తుల నివారణ, జైళ్ళ శాఖ, ప్రత్యేక పోలీస్ విభాగాలు, జైళ్ళ శాఖలకు చెందిన పోస్టులు ఉన్నాయి.

SI ఉద్యోగాలు:
Civil : 710
Armed Reserve : 275
SAR, CPL : 05
TSSP (Men) : 175
TSSP (Men)
15th Betallion - 16
Station Fire Officer : 19
Dy. Jailors - 15
Asst. Matrons : 02
I&T : 29
Thumb Impression
(ASI) : 26

SI ఉద్యోగాలకు అర్హతలు 
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. SC/STలకు ఇంటర్ లేదా తత్సమానం కోర్సు చదివి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీరు పాలిటెక్నిక్ లాంటి కోర్సుల తర్వాత డిగ్రీ చేసి ఉండాలి

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ కేటగిరీలో SI అభ్యర్థులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్
సైన్స్ కేటగిరీల్లో ఏదో ఒకదానిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి

వేలిముద్రల విభాగంలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఓ సబ్జెక్ట్ గా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయో పరిమితి ( 2018 జులై 1 నాటికి )
SI పోస్టులకు 21యేళ్ళు నిండి, 25 యేళ్ళకి మించరాదు. అంటే 1993 జులై 2 నుంచి 1997 జులై 1 మధ్య పుట్టి ఉండాలి

అగ్నిమాపక విపత్తు నివారణ శాఖలో Station Fire Officer : 2018 జులై 1 నాటికి 18 యేళ్ళు నిండి 30 యేళ్ళ లోపు ఉండాలి
1988 జులై 2 - 2000 జులై 1 మధ్య పుట్టి ఉండాలి

జైళ్ళశాఖలో డిప్యూటీ జైలర్స్ : 21యేళ్ళు నిండి 30 యేళ్ళ లోపు ఉండాలి. 1988 జులై 2 నుంచి 1997 జులై 1 తేదీల మధ్య జన్మించి ఉండాలి

జైళ్ళశాఖలో అసిస్టెంట్ మ్యాట్రన్ పోస్టులు: 21యేళ్ళ నిండి 25 యేళ్ళ లోపు ఉండాలి. 1993 జులై 2 నుంచి 1997 జులై 1 మధ్య పుట్టి ఉండాలి

ఫీజులు
SI/Station Fire Officer/ Deputy Jailor/Asst. Matron పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000
SC/ST లు : రూ.500

TS ONLINE, AP ONLINE, MEE SEVA లేదా Internet Banking ద్వారా చెల్లించవచ్చు

కానిస్టేబుల్ పోస్టులు మొత్తం : 16,925

Civil : 5,909
Armed Reserve : 5,273
SARCPL (Men) : 53
TSSP (Men) : 4,816
TS SPF : 485
Firemen : 168
Warders (Men) : 186
Warders (Women) : 35

Infn.Technology, Communications : 142
Police Transport Org. Mechanics (Men) : 19
Police Transport Org. Drivers (Men) : 70
Total Posts : 231

విద్యార్హతలు :
ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, SC/ST లైతే 10 వ తరగతి పూర్తి చేసి ఇంటర్, మొదటి, రెండో సంవత్సరం చదివితే చాలు

కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితి: (2018 జులై 1 నాటికి )
కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18యేళ్ళు నిండి, 22 యేళ్ళ లోపు ఉండాలి. 1996 జులై 2 నుంచి 2000 జులై 1 మధ్య పుట్టి ఉండాలి. హోంగార్డులుగా పనిచేస్తున్న వాళ్ళు 18యేళ్ళ నుంచి 40యేళ్ళ లోపు ఉండాలి

అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్, జైళ్ళ శాఖలో వార్డర్లు (Men, Women) పోస్టులకు 18యేళ్ళు నిండి 30యేళ్ళ లోపు ఉండాలి. 1988 జులై 2 నుంచి 2000 జులై 1 లోపు పుట్టి ఉండాలి.

పోలీస్ శాఖలో సివిల్, AR , జైళ్ళ శాఖలో వార్డర్లకు అప్లయ్ చేసే మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. వితంతువులు, చట్టబద్ధంగా
విడాకులు పొందిన వారు 18 యేళ్ళ నుంచి 40యేళ్ళ లోపు వయసు ఉండాలి.

ఫీజుల వివరాలు:
OC/BC అభ్యర్థులు : రూ.800, SC/ST అభ్యర్థులు : రూ. 400. అన్ని రకాల పోస్టులకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి జూన్ నుంచి
జూన్ 30 వ తేదీ వరకూ సమయం ఉంది. www.tslprb.in వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి.

ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ టెస్టుకు పిలుస్తారు. ఇందులో పాస్ అయితే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది.

వయో పరిమితి మాటేంటి ?
పోలీస్ ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా
మొదటి నోటిఫికేషన్ కు ఇచ్చినట్టే ఇప్పుడు కూడా వయో పరిమితిలో సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీనిపై నోటిఫికేషన్
ఎలాంటి స్పష్టత బోర్డు ఇవ్వలేదు. అయితే వయో సడలింపుపై నిరుద్యోగుల ఒత్తిడితో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

పూర్తి నోటిఫికేషన్ కోసం కింది లింకులు క్లిక్ చేయండి:

PCCIVIL_Notification

PCTECH_Notification

SICIVIL_Notification

SITECH_Notification

SI/PC/VRO/GR.II పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests/

============================================================

PC/SI అభ్యర్థులకు విజ్ఞప్తి

చాలామంది మా మెటీరియల్, కోచింగ్ గురించి అడుగుతున్నారు. మేం 1) అర్థమెటిక్ 2) రీజనింగ్ 3) ఇంగ్లీష్ కు మాత్రమే కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ క్లాసులకు అటెండ్ అయినప్పుడే... GS కు సంబంధించి సబ్జెక్ట్ నిపుణులను పిలిపించి... మీ సొంతంగా GS ఎలా ప్రిపేర్ అవ్వాలో స్పెషల్ క్లాసులు చెప్పిస్తాం. మెటీరియల్ (బుక్స్) మీకు జూన్ 10 నుంచి 15 తేదీలోపు అందుబాటులోకి తెస్తాం. రొటీన్ గా కాకుండా మంచి మెటీరియల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం.

అలాగే యూట్యూబ్ వీడియోలు కూడా తయారు చేస్తున్నాం... ఇందులో టాపిక్ వైజ్ గా ఇంపార్టెంట్ వి కవర్ చేస్తాం. ఇందులో సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయాలు కూడా ఉంటాయి. GK, కరెంట్ ఎఫైర్స్ తో పాటు తెలంగాణ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి.

మాక్ టెస్టులు ఇప్పటికే చాలా ఉన్నాయి. జూన్ 15 తర్వాత రోజు వారి ప్లానింగ్, ఆ వారంలో జరిగిన మాక్ టెస్టులపై గ్రాండ్ ఎగ్జామ్ నిర్వహిస్తాం. SI అభ్యర్థులకైతే అప్లికేషన్ మెథడ్ లో ( JNTUH స్టాండర్డ్ ) ప్రశ్నలు తయారు చేయిస్తున్నాం.

1) మాక్ టెస్టులు, వీకెండ్ లో గ్రాండ్ ఎగ్జామ్
2) ప్రింటెడ్ మెటీరియల్
3) యూ ట్యూబ్ క్లాసులు
4) అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ Off line క్లాసులు
ఈ నాలుగు అంశాల ద్వారా మీరు యూనిఫామ్ జాబ్ కొట్టేలా perfect planning  ఇస్తాం.

ఇంగ్లీష్ మీడియంలో ఇప్పటికే కొన్ని మాక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. మిగతావి జూన్ 10 నుంచి అప్ డేట్ చేస్తాం. జూన్ 10 తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ మాక్ టెస్టులు మొదలు పెడుతున్నాం.

(విష్ణుకుమార్ ఎం, సీనియర్ జర్నలిస్ట్,  www.telanganaexams.com)

Comments are closed.