Thursday, September 19

జూన్ 12 నుంచి స్కూల్స్ ప్రారంభం

తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ జూన్ 12 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యాసంస్థలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం జూన్ 1 వ తేదీ నుంచే స్కూల్స్ తెరవాల్సి ఉంది. ఇప్పుడు గతంలో లాగా జూన్ 12 నుంచి ఓపెన్ అవుతాయి.